విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మరియు నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.గురునాధం జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈరోజు నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు అధ్యక్షతన సీనియర్ కాంగ్రెస్ నాయకులు మాజీ నగర కాంగ్రెస్ అధ్యక్షులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు న్యాయవాది వి.గురునాధం గారి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎపిసిసి అడ్మిన్ జనరల్ సెక్రెటరీ ఎస్.ఎన్.రాజా ముఖ్యఅతిథిగా పాల్గొనగా డాక్టర్ శాస్త్రి జంధ్యాల, ఎస్కే.అన్సారి, వడ్డీ సోమశేఖర్, రత్నాకర్ తాడేపల్లి, రామకృష్ణ, కె.వరప్రసాద్, దామోదర్, కటారి సుబ్రహ్మణ్యం, వేముల శ్రీనివాస్, గొంది సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News