-ఎన్నికలకు చెందిన పలు అంశాల టైం లైన్ చార్ట్ పై అవగాహన కల్పించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి: డా.జి. లక్ష్మీ శ
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల జిల్లా స్థాయి నోడల్ అధికారులు వారి విధులపై పూర్తి స్థాయి అవగాహనతో పక్కా ప్రణాళికతో విధులు నిర్వర్తించాలని,ఎట్టి పరిస్థితిలో అలసత్వం ఉండరాదని, ఎన్నికలకు చెందిన పలు అంశాల టైం లైన్ చార్ట్ పై కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ అవగాహన కల్పించి పేర్కొన్నారు.
బుధవారం ఉదయం స్థానిక కలెక్టరేట్ ఛాంబర్ నందు ఎన్నికల నోడల్ అధికారులతో కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ నోడల్ అధికారిగా వారికి కేటాయించిన విధులపై ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను ఆకళింపు చేసుకొని అప్రమత్తంగా నోడల్ అధికారులు వ్యవహరించాలని సూచించారు. సి – విజిల్ లో అందిన ఫిర్యాదులు ఎన్నికల సంఘం సూచించిన 100 నిమిషాల్లో పరిష్కరించాలి అని సూచించారు. ఎంసిసి ఉల్లంఘనలు ఎట్టి పరిస్థితిలో సహించేది లేదని, తప్పని సరిగా చర్యలు ఉంటాయని, అధికారులు అందరూ ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలి అని తెలిపారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోనున్న నేపథ్యంలో రాజకీయ ప్రకటనలు, పోస్టర్లు, హోర్డింగులు, బ్యానర్ల ప్రదర్శన విషయంలో అధికారులు ఎంతో అప్రమత్తంగా ఉండాలని, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు విరుద్దంగా ఎటు వంటి రాజకీయ ప్రచారాన్ని అనుమతించరాదని సూచించారు. సరిహద్దు రాష్ట్రాల నుండి లిక్కరు, ఓటర్లను ప్రభావితం చేసే పలు రకాల వస్తువుల అక్రమ రవాణాను నియంత్రించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. వెబ్ కాస్టింగ్ ఏర్పాటుతో సరిహద్దు ప్రాంతాల్లో శాశ్వత ప్రాతిపదికన చెక్ పోస్టులు ఉన్న చోట వెబ్ కాస్టింగ్ ద్వారా ఈసిఐ, సిఈఓ ఏపీ, జిల్లా ఎన్నికల అధికారి, ఎస్పీ నిరంతర పరిశీలన ఉంటుందని తెలిపారు. కలెక్టర్ ఛాంబర్ లో ఏర్పాటు చేసిన ఎన్నికలకు సంబందించిన వివిధ అంశాలపై వాటి టైం లైన్ చార్ట్ పై అధికారులకు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ కులశేఖర్, ఎన్నికల విధులు కేటాయించబడిన వివిధ నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.