Breaking News

ఈవీఎం గోడౌన్ ను పరిశీలించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ

రేణిగుంట, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాకు సంబంధించి ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలను భద్రపరిచిన గోదామును తనిఖీ చేసి, పీ.ఓ, ఎపీఓ ల శిక్షణ కొరకు వినియోగించనున్న వివిప్యాట్ లను అత్యంత జాగ్రత్తగా సంబంధిత అధికారులు స్ట్రాంగ్ రూంకు తరలించి శిక్షణ నిమిత్తం వాడాలని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ సంబంధిత అధికారులను ఆదేశించారు.

బుధవారం సాయంత్రం తిరుపతి జిల్లా రేణిగుంట విమానాశ్రయం సమీపంలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ గోడౌన్ నందు భద్ర పరచబడిన ఈవీఎం గోదామును రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చంద్రగిరి నియోజకవర్గానికి గాను 5 మరియు తిరుపతి నియోజక వర్గానికి గాను 10 వెరసి మొత్తం 15 వివిప్యాట్ లు ప్రిసైడింగ్ అధికారుల శిక్షణ కొరకు రీప్లేస్మెంట్ కింద ఈవిఎం గోడౌన్ నుండి సంబంధిత అధికారులు అత్యంత కట్టుదిట్టమైన విధంగా స్ట్రాంగ్ రూం కు నేరుగా తీసుకెళ్లి భద్ర పరచాలని కలెక్టర్ తెలిపారు.

గోడౌన్ వద్ద భద్రతా ఏర్పాట్లను, సిసి కెమెరాలను జిల్లా కలెక్టర్ పరిశీలన చేశారు. బందోబస్తు 24X7 యధావిధిగా కొనసాగాలని సూచించారు. అనంతరం కలెక్టర్ గారు ఇన్స్పెక్షన్ రిజిష్టర్ లో సంతకం చేశారు.

ఈవీఎం యంత్రాలకు కల్పించిన భద్రత, తదితర ఏర్పాట్ల పట్ల రాజకీయ పార్టీల ప్రతినిధులు సంతృప్తిని వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఈవిఎం గోడౌన్ ఇంఛార్జి మరియు ఎస్డిసి కోదండ రామిరెడ్డి, రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *