గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం పన్ను బకాయి అంతా ఏక మొత్తంగా చెల్లించిన వారికి కల్పించిన వడ్డీ రాయితీ గడువు మరో 10 రోజులు మాత్రమే ఉన్నందున పన్ను బకాయిదార్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి బుధవారం ఒక ప్రకటన ద్వారా కోరారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పన్ను బకాయి అంతా ఏక మొత్తంగా చెల్లించిన వారికి వడ్డీ రాయితీ ప్రకటించిందని, నగర పజలు ఈ నెలాఖరులోపు తమ ఆస్తి, ఖాళీ స్థల పన్నులు పూర్తిగా చెల్లించి వడ్డీ రాయితిని పొందాలని తెలిపారు. నగరంలో ఇంకా షుమారు రూ.65 కోట్లు పన్ను బకాయి ఉన్నదని, వార్డ్ సచివాలయాల వారిగా అడ్మిన్ కార్యదర్శులు పన్ను బకాయిదార్లకు పన్ను చెల్లింపుపై అవగాహన కల్గించాలని ఆదేశించారు. ఏప్రిల్ 1 నుండి పన్ను పై వడ్డీ యధావిధిగా ఉంటుందన్నారు. పన్నుపై వడ్డీ రాయితీ పొందేందుకు 10 రోజులే గడువు ఉన్నందున సెలవు రోజుల్లో కూడా జిఎంసి ప్రధాన కార్యాలయం, సర్కిల్ కార్యాలయంల్లోని క్యాష్ కౌంటర్లతో పాటుగా, భారత్ పేటలోని 140, పెద్ద పలకలూరు రోడ్ లోని 106, వసంతరాయపురం మెయిన్ రోడ్ లోని 148 వార్డ్ సచివాలయాల్లోని క్యాష్ కౌంటర్లు యధావిదిగా పనిచేస్తాయన్నారు. కావున నగర పాలక సంస్థకు చెల్లించవలసిన ఆస్తి పన్ను, నీటి పన్ను, ఖాళీ స్థలం పన్ను, నీటి మీటర్ చార్జీలు, డి అండ్ ఓ ట్రేడ్ లైసెన్స్ లు చెల్లించి నగర అభివృద్ధికి సహకరించాలని కోరారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …