Breaking News

డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకులాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

-49,993 మంది విద్యార్ధులు నమోదు.. పరీక్షకు 42,928 మంది విద్యార్ధుల హాజరు
-అందుబాటులో బాలికలకు 9,750 సీట్లు, బాలురకు 5,270 సీట్లు
-22 మార్చి, 2024న ఆన్ లైన్ విధానంలో మొదటి దశ విద్యార్ధుల ఎంపిక
– డా.మహేష్ కుమార్ రావిరాల, ఏపీఎస్‌డబ్ల్యుఆర్ఈఐఎస్ కార్యదర్శి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
డా.బి.ఆర్. అంబేద్కర్ గురుకుల విద్యాలయాల్లో 2024-2025 విద్యా సంవత్సరానికి గాను 5వ తరగతిలో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్షా ఫలితాలను తాడేపల్లిలోని ప్రధాన కార్యాలయం నుండి విడుదల చేసినట్లు ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల (ఏపీఎస్‌డబ్ల్యుఆర్ఈఐఎస్) సంస్థ కార్యదర్శి డా.మహేష్ కుమార్ రావిరాల బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5వ తరగతిలో ప్రవేశాలకు 49,993 మంది విద్యార్ధులు నమోదు చేసుకోగా 10 మార్చి 2024న నిర్వహించిన పరీక్షకు 42,928 మంది విద్యార్ధులు హాజరైనట్లు చేసినట్లు ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా డా.బి.ఆర్.అంబేద్కర్ గురుకులాల్లో బాలికలకు 9,750 సీట్లు, బాలురకు 5,270 సీట్లు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతిభ ఆధారంగా ఆయా కేటగిరీలలో విద్యార్ధులకు అడ్మిషన్లు కల్పించనున్నామని, సదురు అభ్యర్థులు తమ ఫలితాలను http.//apbragcet.apcfss.in నందు పొందగలరని తెలియజేశారు.22 మార్చి 2024 న మొదటి దశ విద్యార్ధుల ఎంపిక ఆన్ లైన్ విధానంలో జరుగుతుందని, తదుపరి ఎంపిక ప్రక్రియ మిగిలిన ఖాళీలను అనుసరించి జోన్ ల వారీగా నిర్వహించబడుతుందని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల (ఏపీఎస్‌డబ్ల్యుఆర్ఈఐఎస్) సంస్థ కార్యదర్శి డా.మహేష్ కుమార్ రావిరాల ప్రకటనలో స్పష్టం చేశారు.

Check Also

విద్యుత్‌ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *