Breaking News

ఆత్మవిశ్వాసంతో తమ వ్యాపారాలు చేసుకోవాలి…

తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
తెనాలి లో వ్యాపారస్తులు పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రశాంతమైన వాతావరణంలో తమ వ్యాపార కార్యకలాపాలు సాగించుకోవాలని అందుకు తమ సహకారం అంటందని జనసేన అభ్యర్ఠి నాదెండ్ల మనోహర్ అన్నారు. గురువారం గంగానమ్మపేట మార్వాడి గుడి సమీపంలో ది తెనాలి వెండి, బంగారం నగల వర్తకుల సంఘం భవనంలో ఆత్మీయ సమావేశం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన హాజరైన జైన సంఘ నాయకులతో మాట్లాడుతూ పెదరావూరు- మంగళగిరి 4 రోడ్లనిర్మాణం టౌన్ లో Ring Road పూర్తి ఇన్ఫ్రాష్ట్రక్చ్ర్ ర్ తో బొంబాయిలోని ” కుర్లా” మోడల్ లోFoot Bridge నిర్మాణ ప్రతి పాదనాలతో తెనాలి ప్రజలకు 50-60 ఏళ్ళ భవిష్యత్తు దృష్టితో అభివృథ్థి పథ ఆలోచనలతో ప్రణాళిక రూపొందిస్తామన్నారు. అంతేగాని తాత్కాలికంగా ఈ గంటగడిస్తె (ఎన్నికలు) చాలన్న రీతిలోతాము రూపొందిన 4 లైన్ల రోడ్లపై విగ్రహాలను పెట్టీ అవరోథాలను(Speed Brakers) సృష్టిస్తున్నారని ఎది అభివృథ్థి-ఏది అవరోథంమో ప్రజలు గ్రహించాలని నాదెండ్ల మనోహర్ అన్నారు. అభివృథ్థి పేరుతో విథించిన పన్నుపై నియత్రణ ఉంటుందని తాము వచ్చిన వెంటనే చెత్తపన్నుండదని, వ్యాపారస్తుల సమస్యలపై తనదృష్టికివస్తే తాను సత్వరం స్పందిస్తానని వ్యాపారస్తుల హర్షథ్వానాలమథ్య అన్నారు. ఈ ఆత్మీయ సమావేశంలో 36వ వార్డు కౌన్సిలర్ తతాడిబోయిన బ్రహ్మయ్య కొత్తమాసు ఆంజనేయులు వెల్లంపల్లి సత్యన్నారాయణ కోగంటి శంకర్రావు, బాబులాల్ ప్రభృతుల పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *