గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగర పాలక సంస్థ రెవిన్యూ ఇన్స్పెక్టర్లు మరియు రెవిన్యూ అధికారులకు కేటాయించిన టార్గెట్ 33 కోట్లు మర్చి 28 నాటికే పూర్తి చేయాలని నగర పాలక సంస్థ అదనపు కమీషనర్ కె.రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. కమీషనర్ కీర్తి చేకూరి ఆదేశాల మేరకు రెవిన్యూ వసూళ్ళ వేగవంతం పై గురువారం ఉదయం కమీషనర్ ఛాంబర్ నందు డిప్యుటీ కమీషనర్లతో కలిసి రెవిన్యూ అధికారులు మరియు రెవిన్యూ ఇన్స్పెక్టర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశం నందు తొలుతగా 21 వ తేది వరకు రెవిన్యూ ఇన్స్పెక్టర్ల వారీగా వసూళ్ళ వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంకనూ నగర పాలక సంస్థ ప్రైవేటు డిమాండ్ ద్వారా 63 కోట్లు వసూలు చేయాల్సిన ఉందని, ఆర్.ఐ లు వసూళ్లను వేగవంతం చేయాలని, 33 కోట్లలను రెవిన్యూ ఇన్స్పెక్టర్ల వారీగా టార్గెట్ లను విధించారు. ప్రతి ఒక్కరూ నిర్దేశిత టార్గెట్ లను ఈ నెల 28 వ తారీఖు నాటికి పూర్తి చేయాలన్నారు. వార్డు అడ్మిన్ సెక్రటరీలు ప్రతి ఒక్కరూ ఉదయం 8 గంటలకల్లా వసూళ్ళ కై వార్డులలో తిరిగేలా చూడాలన్నారు. పెద్ద మొత్తంలో ఉన్న బకాయిదారుల పన్ను వసూళ్ళకు రెవిన్యూ ఇన్స్పెక్టర్లు, రెవిన్యూ అధికారులు మరియు డిప్యుటీ కమీషనర్లు కూడా పాల్గొని లక్ష్యాలను అధిగామించాలన్నారు. ప్రతి రోజు సాయంత్రం రెవిన్యూ వసూళ్ళ పై టెలి కాన్ఫరెన్స్ నిర్వహిస్తామన్నారు. ఖాళీ స్తలం పన్ను బకాయిల పై సమీక్షించి వడ్డీ రాయితీ ఉన్నందున నిర్మాణంలో ఉంది నగర పాలక సంస్థకు బకాయిలు ఉన్న ఖాళీ స్తలం పన్ను బకాయిలు ఉన్న గృహ యజమానులకు అవగాహన కలిగించి, ఖాళీ స్తలం పన్ను వసూళ్లు నూరు శాతం జరిగేలా చూడాలన్నారు. పట్టణ ప్రణాళిక అధికారులు ఖాళీ స్తల పన్ను బకాయిలు ఉన్న గృహ యజమానుల వివరాలను అందించాలని, ప్లానింగ్ సెక్రటరీలతో కలిసి ఖాళీ స్తలం పన్ను వసూళ్ల వేగావంతానికి సహకరించాలన్నారు. సదరు సమావేశంలో డిప్యుటీ కమీషనర్లు చెరువు శ్రీనివాస్, వెంకట కృష్ణయ్య, రెవిన్యూ అధికారులు బాలాజీ బాష, సాంబశివరావు, రెహమాన్, రెవిన్యూ ఐన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
తెలుగులో ప్రభుత్వ ఉత్తర్వులు ఇవ్వాలన్న కూటమి ప్రభుత్వ నిర్ణయం హర్షించదగ్గ పరిణామం
-రాష్ట్ర పర్యాటక,సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ -తెలుగు భాషకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్న మంత్రి దుర్గేష్ అమరావతి, …