అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా రాష్ట్రంలో వున్న మహిళలు (గర్భవతులు, బాలింతలు) ఎక్కువ సంఖ్యలో సౌఖ్యంగా తమ ఓటు హక్కు వినియోగించుకొనుటకు కల్పించవలసిన ఏర్పాట్ల గురించి ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ కు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ తరపున చైర్-పర్సన్ గజ్జల వెంకట లక్ష్మి విజ్ఞప్తి చేశారు.
1) అన్ని పోలింగ్ బూత్ ల వద్ద మహిళలకు వేరుగా క్యూ లైన్ లు ఏర్పాటు చేయగలరని కోరుతున్నాము.
2) చిన్న పిల్లలతో వచ్చే బాలింతలకు పోలింగ్ బూత్ వద్ద ప్రత్యేకంగా ఫీడింగ్ రూమ్ ఉంచుటకు చర్యలు కోరటమైనది.
3) గర్భవతులకు అత్యవసర పరిస్ధితిలో అవసరమైన వైద్య సేవలు అందే విధంగా చర్యలు తీసుకొనగలరని కోరుతున్నాము.
4) రాష్ట్రంలో ఎలక్షన్ నాటికి పెరిగే ఉష్ణోగ్రతలు దృష్ట్యా మహిళలు వడ దెబ్బకు గురి కాకుండా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద షెల్టర్, మంచి నీరు మరియు ORS అందుబాటులో ఉంచవలసిoదిగా కోరటమైనది.
5) రాష్ట్రంలో అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద మహిళల కొరకు అత్యవసర వైద్య సేవలు కొరకు తగు సిబ్బంది అందుబాటులో ఉంచవలసినదిగా కోరటమైనది.
6) అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద మహిళలకు విధిగా మొబైల్ టాయిలెట్స్ ఏర్పాటు చేయుటకు చర్యలు తీసుకోవలసినదిగా కోరటమైనది.
7) కొన్ని అత్యవసర సందర్భాల్లో మహిళలపై దాడులు, అత్యాచారాలు, వేధింపులు, తదితర విషయాల్లో వారికి తగు న్యాయం జరుపుట కొరకు బాధితులను పరమర్శించుటకు మహిళా కమిషన్ చైర్-పర్సన్ మరియు మెంబర్లకు ఎన్నికల నిబంధనలలో సడలింపు ఇవ్వవలసినదిగా విజ్ఞప్తి చేస్తున్నాము.
8) ఎన్నికల నియమావళిలో ట్రైబల్ మహిళలు ఉన్న ప్రదేశలలో మినహాయింపు ఇచ్చినచో ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ తరపున అవగాహన కార్యక్రమాలు జరుపుటకు అవకాశం కలిపిoచినట్లు అవుతుందని విజ్ఞప్తి చేశారు.
Tags AMARAVARTHI
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …