గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో మెరుగైన త్రాగునీటి సరఫరా జరిగేలా, ఎక్కడా త్రాగునీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, మెయిన్ పంపింగ్ లైన్ల మీద గుర్తించిన లీకులను యుద్ద ప్రాతిపదికన మరమత్తు చేయడం జరుగుతుందని నగర కమిషనర్ కీర్తి చేకూరి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ హెడ్ వాటర్ వర్క్స్ సంగం జాగర్లమూడి నుండి గుంటూరు నగరానికి త్రాగునీరు సరఫరా చేసే 685 ఎం.ఎం. డయా సిఐ పంపింగ్ మెయిన్ లైన్ పై లీకు ఏర్పడి నీరు వృధా అవుతుందని, లీకు మరమత్తు పనులను వెంటనే చేపట్టాల్సి ఉందన్నారు. లీకు మరమత్తు పనుల కోసం సంగం జాగర్లమూడి ఫిల్టరేషన్ ప్లాంట్ పూర్తిగా నిలుపుదల చేయాలనీ, ఈ నెల 25 (సోమవారం) ఉదయం సరఫరా తదుపరి పనులు చేపట్టడానికి ఇంజినీరింగ్ అధికారులు కార్యాచరణ సిద్దం చేశారని తెలిపారు. పైప్ లైన్ మరమత్తు పనుల వలన సోమవారం సాయంత్రం నుండి మంగళవారం ఉదయం వరకు నగరంలోని నాజ్ సెంటర్ రిజర్వాయర్ పరిధిలోని 5,7 డివిజన్లలోని నాజ్ సెంటర్, గుంటూరువారి తోట, పొత్తూరువారి తోట, గణేష్ రావు పేట, కొత్తపేట, రాజాగారితోట, రామిరెడ్డితోట 1 నుండి 8 లైన్లు, గంటలమ్మ చెట్టు, చౌత్రా సెంటర్, పూల మార్కెట్, ఎల్బినగర్, బాలాజీ నగర్ ప్రాంతాల్లో త్రాగునీటి సరఫరా నిలిపివేయబడుతుందని, మంగళవారం (26వ తేదీ) సాయంత్రం నుండి త్రాగునీటి సరఫరా యధావిదిగా జరుగుతుందని, నగర ప్రజలు సదరు అంశాన్ని గమనించి తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని, సహకరించాలని కోరారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …