Breaking News

వాహనాల, ర్యాలీలకు అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి:రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా

-పోలింగ్ కేంద్రాల్లో కనీస మౌలిక సదుపాయాల కల్పన పూర్తి స్థాయిలో ఉండాలి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
వివిధ ఫారాలు క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్స్ పెండింగ్ ఉన్నవాటిని ఈ నెల మార్చి 26 నాటికి పూర్తి కావాలని, సువిధ, ఎన్ కోర్ యాప్ ల వినియోగం, సీజర్ తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర సచివాలయం సిఈఓ కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో రానున్న సాధారణ ఎన్నికలు 2024 సన్నద్ధతకు సంబందించిన పలు అంశాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో శుక్రవారం మధ్యాహ్నం సమీక్ష నిర్వహించి సూచించగా, తిరుపతి కలెక్టరేట్ నుండి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ సంబంధిత అధికారులతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ వివిధ రకాల పెండింగ్ ఫారాల క్లెయిమ్స్ అండ్ అబ్జెక్షన్లను ఈ నెల మార్చి 26 నాటికి పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రచారం కొరకు వాడే వాహనాలు, ర్యాలీలు పర్మిషన్ కొరకు అనుమతుల కొరకు సంబంధిత రాజకీయ పార్టీలు, రాజకీయ పార్టీల ప్రతినిధుల నుండి అందిన వాటిని ఎన్కోర్ పర్మిషన్లు సకాలంలో చేయాలని అన్నారు. కమాండ్ కంట్రోల్ రూం లు ఏర్పాటు ఉండాలని సూచించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో శాంతి భద్రతలు పర్యవేక్షణ, సీజర్ ఆఫ్ క్యాష్, లిక్కర్, డ్రగ్స్ తదితరాలపై చెక్ పోస్టులు, స్టాటిక్ సర్వైవలెన్స్ టీంలు, సంబంధిత ఫ్లయింగ్ స్క్వాడ్ లు మరింత చైతన్యవంతంగా పని చేయాలని సూచించారు.

విసి అనంతరం కలెక్టర్ అధికారులతో సమీక్షిస్తూ సిఈఓ గారు సూచించిన అంశాలపై దృష్టి పెట్టి తదనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో పూర్తి స్థాయిలో కనీస మౌలిక సదుపాయాల కల్పన ఉండేలా చూడాలని ఆదేశించారు. యంగ్ ఓటర్ల నమోదు ఫారం6 చేయాల్సి ఉంటుందని తెలిపారు. సి – విజిల్, కంట్రోల్ రూం మరియు సిబ్బంది అప్రమత్తంగా పని చేయాలనీ సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ నందు డిఆర్ఓ పెంచల కిషోర్, వివిధ నోడల్ అధికారులు, ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ చంద్ర శేఖర్, ఎన్నికల డి.టి పవన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *