విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఢిల్లీ సీఎం అరవింద కేజ్రీవాల్ అరెస్ట్ మీద ఇండియా కూటమి సభ్యులు శుక్రవారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి నేతి మహేశ్వర రావు మాట్లాడతూ దేశం లో రాజ్యాంగాన్ని రక్షించాలిసిన అధికారులు ఒక్క ప్రతి పక్ష పార్టీ ల మీదనే దాడులు చేయడం చూస్తుంటే ప్రజాస్వామ్యాన్ని రక్షించాలిసిన అధికారులు దగ్గరుండి మరి అధికార పార్టీ నియంతృత్వ విధానాలకు మద్దత్తు ఇస్తున్నట్లు ఉంది అన్నారు. కేజ్రీవాల్ మీద ఆరోపణ ఎన్నికల కోసం నిధులు తీసుకొన్నారని మరి అదే బీజేపీ 5000 కోట్లకు పైగా నిధులు అడ్డదారిన సేకరించిన విధానం మీద ED చర్యలు ఉండవా అని ప్రశ్నిస్తున్నాము అన్నారు. బీజేపీ ఎల్ట్రోల్ బాండ్స్ తీసుకొన్న విధానం చుస్తే కంపెనీ లకు కాంట్రాక్టు లు ఇవ్వడం తరువాత ఆయా కంపెనీ లు నిధులు ఎల్ట్రోల్ బాండ్ ల రూపంలో బీజేపీ ఇవ్వడం అలాగే ED,IT దాడులు జరిగిన తరువాత ఆయా కంపెనీ లు బీజేపీ ఎల్ట్రోల్ బాండ్ లు ఇవ్వడం లాంటి అంతులేని అవినీతి కనపడటం లేదా అని ప్రశ్నిస్తున్నాము అన్నారు. బినామీ కంపెనీ ల ద్వారా బీజేపీ ఎల్ట్రోల్ వచ్చాయన్న అనుమానం బీజేపీ కి నిధులు ఇచ్చిన ఫ్యూచర్ గేమింగ్ లాంటి కంపెనీల ఆఫీస్ చూస్తే అర్ధం అవుతుంది.బీజేపీ కి వచ్చిన నిధులు బినామీ కంపెనీల ద్వారా వచ్చి ఉంటె మరి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా ని ప్రభుత్వం లో ఉన్న మోడీని కూడా ED విచారించాలిసిన అవసరం లేదా అని అడుగుతున్నాం అన్నారు. హిండెన్ బర్గ్ రిపోర్ట్ లో అన్ని అనుమానాస్పద హవాలా లావాదేవీలు ఉన్నాయని ఆధారాలతో సహా ఇస్తే ఇప్పటి వరకు ED ఎందుకు చర్యలు తీసుకోలేదు అని అడుగుతున్నాం అన్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలిసిన అధికారులే బీజేపీ పార్టీ తొత్తులుగా మారారు అనుకొంటున్న దేశప్రజల మాటలకు అధికారులు వివరణ ఇవ్వాలి అన్నారు లేకపోతే ప్రజలే పక్షపాతవైఖరితో వ్యవహరిస్తున్న అధికారుల మీద తిరగబడే రోజులు వస్తాయని ఆ రోజు మీరందరు సమాధానం చెప్పవలసి వస్తున్నది అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి అన్నారు.
AAP Party కన్వీనర్ రమేష్ మాట్లాడుతూ దేశం పార్టీ అంటే బీజేపీ భయపడుతోందని అందుకే ప్రపంచంలో పేదలకు కార్పొరేట్ స్థాయి విద్యని అందిస్తున్న సిసోడియాని సంవత్సరం క్రితం అరెస్ట్ చేసి బెయిల్ కూడా ఇవ్వని పరిస్థితి ఉండగానే అరవింద కేజ్రీవాల్ ని ఎన్నికల ముందు అరెస్ట్ చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని చంపే ప్రక్రియ జరుగుతుంది అన్నారు.
కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షులు సుంకర పద్మశ్రీ మాట్లాడుతూ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తో భయపడిన బీజేపీ మా కాంగ్రెస్ పార్టీ కి సంబందించిన ఆర్థిక కార్యకలాపాలను స్తంభించి కాంగ్రెస్ పార్టీ ని ఎన్నికలలో దెబ్బకొట్టాలని చూస్తున్నారు అన్నారు అరవింద కేజ్రీవాల్ ని అరెస్ట్ చేయడం అంటే ఇండియా కూటమిని చుస్తే మోడీ భయపడుతున్నారు అని అర్ధం అవుతుంది అన్నారు.
సిపిఐ పార్టీ నాయకులు అక్కినేని వనజ మాట్లాడుతూ మేఘ కృష్ణారెడ్డి కంపెనీ మీద దాడులు జరిగిన తరువాత ఎన్నికల బాండ్లు ఇచ్చిన పరిస్థితి అలాగే ఫ్యూచర్ గేమింగ్ కంపెనీ తో సంబంధాలున్న అమిత్ షా ని అరెస్ట్ చేయాలిసిన పనిలేదా అన్నారు.
ఈ కార్యక్రమం లో కాంగ్రెస్, ఆప్, సిపిఐ నాయకులైన ఫణికుమార్, కోటేశ్వర రావు వివిధ పౌరసంఘాల నాయకులు పాల్గొని అరవింద్ కేజ్రీవాల్ అక్రమ అరెస్ట్ ని ఖండిస్తూ ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అని పెద్ద ఎత్హున నినాదాలు చేయడం జరిగింది.