Breaking News

పోలవరం ప్రాంత సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పని చేస్తాం

-పోలవరం నియోజకవర్గ నాయకులతో పవన్ కళ్యాణ్ భేటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
పోలవరం నియోజకవర్గంలో ఉన్న సమస్యల పరిష్కారానికి ఉమ్మడి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తుందని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. శనివారం సాయంత్రం మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో పోలవరం నియోజకవర్గ నాయకులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆ నాయకులు తమ నియోజకవర్గ సమస్యలు తెలియచేశారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం విషయంలోనే కాదు… నిర్వాసితులకు పునరావాస కల్పన, పరిహారం చెల్లింపులోనూ వైసీపీ ప్రభుత్వం విఫలమైందని వారు చెప్పారు. ఇక్కడి యువతకు ఉపాధి అవకాశాలు కల్పన అవసరమని తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని రాజకీయ పరిస్థితులను వివరించారు. పవన్ కళ్యాణ్ స్పందిస్తూ “పోలవరం ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అక్కడి సమస్యలపై అవగాహన ఉంది. మెరుగైన విద్య, వైద్యంతోపాటు ఉపాధి అవకాశాలు కల్పించడంపైనా దృష్టిపెడతాము. ఈ నియోజకవర్గంలో జనసేన సత్తా చూపాల్సిన సమయం వచ్చింది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వం వస్తుంది” అన్నారు.
ఈ సందర్భంగా జనసేన నాయకుడు చిర్రి బాలరాజుకు ఎన్నికల నియమావళి, నిబంధలతో కూడిన పత్రాలను అందచేశారు. ఈ సమావేశంలో కరాటం రాంబాబు, గడ్డమణుగు రవికుమార్, కరాటం సాయి చంద్రమోహన్ పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *