Breaking News

ఏపీ ఎస్పీఎఫ్ ఏపీ సెక్రటేరియట్ యూనిట్ నందు ఉచిత కంటి పరీక్ష శిబిరం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ సచివాలయం నందు విధులు నిర్వహిస్తున్న APSPF అధికారులకు మరియు సిబ్బందికి సచివాలయం ప్రాంగణం నందు ఏపీఎస్పీఎఫ్ డీజీ డాక్టర్ త్రివిక్రమ వర్మ వారి ఆదేశములు మేరకు ఐజి B.V.రామిరెడ్డి మరియు కమాండెంట్ ఎం.శంకర్రావు వారి ఆధ్వర్యంలో మార్చ్ 23, 2024 న డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ విజయవాడ వారి సౌజన్యం తో ఉచిత కంటి పరీక్ష నిర్వహించబడినది అని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ ఏపీ సెక్రటేరియట్ కే.కృష్ణమూర్తి తెలిపారు. అలాగే పరీక్షలు నిర్వహించిన డాక్టర్ అగర్వాల్ ఐ ఆసుపత్రి సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. డాక్టర్ అగ్రవాల్ ఆసుపత్రి వారు, సిబ్బందిని ఉద్దేసించి మాట్లాడుతూ ఈ కంటి పరీక్షలు నిర్వహించడం వలన సిబ్బంది యొక్క కంటి సమస్యలను ముందుగానే తెలుసుకొని తగిన వైద్యం చేయించుకొనుటకు వీలుగా ఉంటుందని మరియు పాటించవలిసిన ఆహార నియమాలు గురుంచి వివరించినారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 220 మందికి సిబ్బందితో పాటు ఇన్స్పెక్టర్లు ఎం. వెంకటేశ్వకర్లు, డా.ఏ.సతీష్ కుమార్, ఎస్సైలు మరియు ఏఎస్సైలు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *