Breaking News

జిల్లా స్థాయి ఆయుధ లైసెన్స్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం నిర్వహించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీ శ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలు 2024 నిర్వహణకు ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో వెపన్ లైసెన్స్ ఉంటే సంబంధిత పోలింగ్ స్టేషన్ పరిధిలోని వారు వెపన్లను సంబంధిత పోలీస్ స్టేషన్లో డిపాజిట్ తప్పక చేయాలని జిల్లా స్థాయి ఆయుధ స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ అన్నారు.

శనివారం రాత్రి స్థానిక కలెక్టరేట్ కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా స్థాయి ఆయుధ లైసెన్స్ స్క్రీనింగ్ కమిటీ సమావేశం ఎస్పీ కృష్ణ కాంత్ పాటిల్ తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు వెపన్ కలిగి ఉన్న వారు సత్వరమే సంబంధిత పోలీస్ స్టేషన్లో వాటిని డిపాజిట్ చేయాలని సూచించారు. అంతే కాకుండా బ్యాంకు మేనేజర్ ల పేరుపై గన్ లైసెన్స్ ఉంటే వారు ఏటీఎంలకు క్యాష్ మూవ్మెంట్ కొరకుభద్రత కొరకు అవసరమున్న నేపథ్యంలో వాటికి, అలాగే బ్యాంకుల్లో ఎక్స్ సర్వీస్ మన్ పేరుపై వెపన్ లైసెన్స్ తో వెపన్ కలిగి ఉండి సంబంధిత బ్యాంకు మేనేజర్ పై వెపన్ లైసెన్స్ లేనిచో వాటికి మాత్రమే మినహాయింపు ఉంటుందని తెలిపారు.

ఈ సందర్భంగా ఎస్పీ వివరిస్తూ జిల్లాలో 464 మంది, సంస్థలు అనుమతులు పొందగా మొత్తం 503 తుపాకులు ఉన్నాయని, ఎన్నికల షెడ్యూల్ విడుదల నేపథ్యంలో 407 తుపాకులు డిపాజిట్ చేశారని తెలిపారు. తగు చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ వెంకట్రావు, డి ఆర్ ఓ పెంచల్ కిషోర్, ఈ ఆర్ ఓ లు అదితి సింగ్, రవి శంకర్ రెడ్డి, నిషాంత్ రెడ్డి, చంద్రముని, సి సెక్షన్ సూపరింటెండెంట్ గంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *