విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ రంగుల పండుగ మనందరి జీవితాల్లోకి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం తీసుకురావాలి..హోలీ పండుగ ముందు రోజు పాత వస్తువులను, పనికిరాని వస్తువులను కాల్చివేసినట్లు ఈ ఎన్నికల్లో సైకో జగన్ పార్టీని కాల్చేసి, టీడీపీ, బీజేపి, జనసేన పార్టీలతో అద్భుతమైన రంగుల కలయికగా ఉన్న ఎన్డీఏ కూటమిని అధికారంలోకి రావాలని జనసేన, బిజెపి బలపరిచిన తెలుగుదేశం పార్టీ విజయవాడ పార్లమెంట్ అభ్యర్ధి కేశినేని శివనాథ్ (చిన్ని) ఆకాంక్షించారు. సోమవారం విజయవాడ క్లబ్ నందు వాకర్స్ అసోసియేషన్ సభ్యులతో నిర్వహించిన హోలీ సంబరాల్లో కేశినేని శివనాథ్ గారు ఉత్సాహంగా పాల్గొన్నారు. అందరికీ రంగులు పూసి హోలీ శుభాకంక్షలు తెలిపారు. వాకర్స్ అసోసియేషన్ సభ్యుల కూడా శివనాథ్ గారికి ఆత్మీయంగా రంగులు చల్లారు. వసంత రుతువులో కొత్త ఆశలతో రంగుల వేడుకగా ఈ పండుగను జరుపుకుంటాం. ఈ వేడుకతో పాటు రానున్న రెండు నెలల్లో టిడిపి అధికారంలోకి వచ్చి ప్రజల జీవితాల్లో హరివిల్లు కురిపిస్తుందని శివనాథ్ తెలియజేశారు.
Prajavartha Online Telugu News