Breaking News

శ్రీ కాళహస్తి నియోజకవర్గ పరిధిలోని స్కిట్ కాలేజ్ నందు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లు, పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి

-ఎన్నికల పక్రియలో అధికారులు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలి
-బి ఎల్ వోలు మాక్ పోలింగ్ పై ప్రత్యేక అవగాహన కలిగి ఉండాలి: కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలు -2024 నేపథ్యంలో స్ట్రాంగ్ రూం ఏర్పాట్లు పరిశీలించడం జరిగిందనీ, అందరూ అధికారులు బాధ్యతగా వారి విధులపై పూర్తిస్థాయి అవగాహనతో, అలాగే బిల్వోలు ప్రణాళిక బద్ధంగా విధులను నిర్వర్తించాలి అని కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీ శ ఆదేశించారు.

సోమవారం మధ్యాహ్నం శ్రీ కాళహస్తి నియోజకవర్గ లోని స్కిట్ కాలేజ్ నందు ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్, భాస్కర పేటలో ని 95, 96, 97 పోలింగ్ కేంద్రాలు, ఊరందూరు లోని జడ్పీ హైస్కూల్ లోనీ 45 వ పోలింగ్ కేంద్రoను జిల్లా కలెక్టర్ పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రానున్న సార్వత్రిక ఎన్నికలు నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్, డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో అన్ని ఏర్పాట్లును పూర్తి చేయాలని తెలిపారు. పోలింగ్ కేంద్రాలకు తరలించే ఈ వీ ఎంలు, వీ వీ ప్యాట్ లు భద్రపరిచే స్ట్రాంగ్ రూములు, అక్కడ నుంచి కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే రూట్ మ్యాప్ భద్రత అంశం దృష్టిలో పెట్టుకొని తగు ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. అనంతరం భాస్కరపేట లో మున్సిపల్ హై స్కూల్ నందు ఏర్పాటుచేసిన 95, 96, 97, ఊరందూరులోని 45 పోలింగ్ కేంద్రాలను పరిశీలించి పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు రాకుండా చూడాలని ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. బి ఎల్ వో లు పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రక్రియ పై పూర్తిగా అవగాహన కలిగి తమ విధులను సమర్థవంతంగా నిర్వహించేలా చూడాలని తెలిపారు. బిఎల్వో లు అందరూ మాక్ పోలింగ్ పై కూడా ప్రత్యేక అవగాహన కలిగి ఉండాలని అన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనకు తావివ్వకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టాలని తెలిపారు. నియోజకవర్గ పోలింగ్ కేంద్రాలలో ఎండాకాలంను దృష్టిలో పెట్టుకొని ర్యాంపు, త్రాగునీటి వసతి, మరుగుదొడ్లు తదితర మౌలిక సదుపాయాల ఏర్పాట్లను పగడ్బందీగా చేపట్టాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి ఈ ఆర్ ఓ మరియు ఆర్డీఓ రవి శంకర్ రెడ్డి, తాశిల్డార్ జనార్దన్ రాజు, బి ఎల్ వో లు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కొండవీడు ఉత్సవాల్లో సీబీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ‘వందేమాతరం’ చిత్ర ప్రదర్శనను ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. పెమ్మసాని

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కొండవీడు ఉత్సవాల్లో భాగంగా, ‘జాతీయ గీతం వందేమాతరం – 150 సంవత్సరాలు’ అనే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *