– సాధ్యమైనంత తొందరగా మరమ్మత్తులు పూర్తి కి చర్యలు
– ట్రాఫిక్ నిబంధనలు పాటించి సహాకారం అందించాలి
– కలక్టర్ మాధవీలత, ఎస్పి జగదీష్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
మంగళవారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రవాణా, రోడ్లు భవనాలు శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పి ఏస్ ప్రద్యుమ్న, ఇతర అధికారులు గమన్ బ్రిడ్జి (4 వ వంతెన) అంశంపై సమీక్ష నిర్వహించారు. రాజమహేంద్రవరం కలెక్టరేట్ వీడియో సమావేశ మందిరం నుంచి కలెక్టర్, ఇతర అనుబంధ శాఖల అధికారులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత వివరాలూ తెలియ చేస్తూ, ఆర్ జి బి ఎల్ ప్రతినిధులు మరమ్మత్తులకు సంబందించి నీ కోసం నివేదిక అందజేయాడం జరిగిందనీ పేర్కొన్నారు. ఆమేరకు బేరింగ్ లు అందుబాటులో ఉంటే తక్షణం తదుపరి పనులను ప్రారంభించిన కార్యచరణ ప్రణాళికా అందచేయాలని స్పష్టం చేశామన్నారు. గామన్ వంతెన కి సంబంధించిన పూర్తి స్థాయిలో తనిఖీలు నిర్వహించడానికి అనుగుణంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ, ప్రతి రోజు పనుల పురోగతి పై సమీక్ష నిర్వహించ నున్నట్లు తెలిపారు. ప్రస్తుత గామన్ వంతెన మరమ్మత్తుల నేపథ్యంలో ట్రాఫిక్ నిబంధనలు పాటించడంలో రవాణా శాఖ, పోలీసు, ఆర్ అండ్ బి, జాతీయ రహదారులు, రెవెన్యూ అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుందనీ అన్నారు. మొత్తం పనుల కోసం 8 బేరింగ్ లు అవసరం అవుతాయని, మిగిలిన చోట్ల కూడా తనిఖీలు నిర్వహించి నివేదికలు అందచేయాలని ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. ఎస్పీ పి. జగదీష్ మాట్లాడుతూ, గామన్ వంతెన మార్గంలో ఒక వైపు మాత్రమే ట్రాఫిక్ మళ్లింపు చేయనున్న దృష్ట్యా ట్రాఫిక్ సమస్య రాకుండా పోలీస్, రవాణా, రెవెన్యూ అధికారులు అధ్వర్యంలో చర్యలు తీసుకోవడం జరుగుతోందని అన్నారు. ఈ సందర్భంగా ముఖ్య కార్యదర్శి పి ఎస్ ప్రద్యుమ్న మాట్లాడుతూ, గమన్ వంతెన నిర్వహణా సామర్ధ్యం పై తనిఖీలు నిర్వహించి , నివేదికలు అందచేయాలని స్పష్టం చేశారు. అనంతరం రోడ్ కం రైల్ వంతెన పనులపై సమీక్ష నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి ఎస్పీ పి. జగదీష్, రాజమండ్రీ గోదావరీ బ్రిడ్జి లిమిటెడ్ (ఆర్ జీ బి ఎల్) చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఏ హెచ్ ఖురేషి, నేషనల్ హైవే ఈ ఈ సురేంద్ర బాబు, ఈఈ ఆర్ అండ్ బి ఎస్బివి రెడ్డి, ఈఈ ఆర్ డి సి – ఏ. శ్రీకాంత్, ఆర్ టి వో – కె వి కృష్ణా రావు, లసా కన్సల్టెంట్ సీనియర్ బ్రిడ్జి తనిఖీ నిపుణులు మురళీధర్, ఆర్ జి బి ఎల్ సీనియర్ ఇంజినీర్ ఆశిష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.