Breaking News

ఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేయాలి…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళిని పటిష్టంగా అమలు చేయాలని, ఫ్లైయింగ్ స్క్వాడ్ టీంలు అత్యంత అప్రమత్తంగా విధులు నిర్వహించాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) కీర్తి చేకూరి స్పష్టం చేశారు. మంగళవారం కమిషనర్ చాంబర్ లో ఫ్లైయింగ్ స్క్వాడ్ టీంలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు తమకు కేటాయించిన విధుల్లో అప్రమత్తంగా ఉండాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. సీ విజిల్ యాప్ లో అందే ఫిర్యాదులను ఎట్టి పరిస్థితుల్లోను నిర్దేశిత సమయంలో హాజరై పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా పటిష్టంగా అమలు చేయాలని, నిబందనలు పాటించని రాజకీయ పార్టీల అభ్యర్ధులపై కేసులు నమోదు చేయాలన్నారు. బృందం పరిధిలో అనుమతి లేకుండా ప్రచారాలు, ర్యాలీలు చేసినా, అనధికార నగదు తరలించినా వెంటనే కేసులు నమోదు చేయలని, బృందంలో పోలీసు సిబ్బంది మరింత భాధ్యతగా విధుల్లో ఉండాలని పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అతిక్రమించిన వారు ఎవరైనా ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు నిర్దేశిత సెక్షన్ ల మేరకు చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు ఎక్స్పెండీచర్ టీంతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎన్నికల్లో అక్రమాలను అడ్డుకోవడంలో ఫ్లైయింగ్ స్క్వాడ్ ముందుండాలని, క్షేత్ర స్థాయిలో ఏ సమస్య ఎదురైనా తక్షణం తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.
సమావేశంలో సెక్టోరల్ అధికారి శ్రీధర్, ఏఆర్ఓలు సునీల్, భీమరాజు, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ నాగేంద్ర కుమార్, ఎక్స్పెండీచర్ టీం, ఫ్లైయింగ్ స్క్వాడ్ టీంలు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *