-మేమంతా మీ సమస్యల పరిష్కారానికే కృషి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
టిడిపి ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కృషి చేసిన పెద్దలు వున్నారు. మీరందరూ నన్ను చేయిపట్టి నడిపించాలని కోరుకుంటున్నాను. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ప్రతి కాలనీలో ఎంతో మంది ఆత్మీయలు వున్నారు. మీ అందర్నీ కలవటం సంతోషం గా వుంది. మీరందరూ కలిసి విజయవాడ తూర్పు నియోజకవర్గంలో బిజెపి, జనసేన బలపరిచిన టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధి గద్దె రామ్మోహన్ ని 50 వేల మెజార్టీతో గెలిపించాలి అని విజయవాడ ఎంపి జనసేన, బిజెపి బలపర్చిన టిడిపి ఎంపి కేశినేని శివనాథ్ కోరారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గంలోని 3వ వార్డ్ నాగార్జున నగర్ కాలనీ వాసులతో ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిధిగా కేశినేని శివనాథ్, విజయవాడ ఈస్ట్ టిడిపి ఎమ్మెల్యేఅభ్యర్ధి గద్దె రామ్మెహన్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సమావేశానికి గన్నవరం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధి యార్లగడ్డ వెంకట్రావు, నూజివీడు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్ధి కొలుసు పార్థసారధి కూడా హాజరైయ్యారు.
ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ నాగార్జున నగర్ టిడిపికి కంచుకోట…ఇక్కడ నుంచి టిడిపి పార్టీకి అధిక మెజార్టీ రావాలి. టిడిపి గెలుపే లక్ష్యంగా టిడిపి, జనసేన, బిజెపి కూటమి తరుఫున పోటీ చేసే ఎమ్మెల్యే అభ్యర్ధలందరూ ఒకరికొకరు సహకరించుకుంటున్నారు. గన్నవరంలో టిడిపి నమ్మక ద్రోహం చేసిన వ్యక్తి వున్నాడు. గన్నవరం టిడిపికి కంచుకోట…ప్రజాజీవితంలో అలాంటి నమ్మకద్రోహులకి చోటు లేదని యార్లగడ్డ వెంకట్రావు అత్యంత భారీ మెజార్టీ గెలిచి నిరూపించనున్నారు. ఈ సమావేశానికి హాజరైన యార్లగడ్డ, కొలుసు ఈ నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తులే..మేమంతా ఈ నియోజకవర్గ అభివృద్దికి కృషి చేస్తాం. మీ సమస్యలకి తోడుగా నిలబడి వాటిని పరిష్కరిస్తాము.
ఇక ముప్పై ఏళ్లుగా రాజకీయాల్లో కొనసాగుతున్న మచ్చలేని నాయకుడు గద్దె రామ్మోహన్. వారి అడుగుజాడల్లోనే నడుస్తుంటాను. గద్దె జీవితం తెరిచిన పుస్తకం లాంటిది. నిత్యం ప్రజలతో వుంటారు. ఈ నియోజకవర్గ ప్రజల సమస్యల విషయంలో కానీ, అభివృద్ది విషయంలో కానీ గద్దెతో పాటే , మీ అందరికి అందుబాటులో వుంటాను.
రాజకీయం గా మా కుటుంబం నిలబడటానికి చంద్రబాబు గారు, తెలుగుదేశం పార్టీ ఎంతో సాయం చేసింది. మా కుటుంబానికి చెందిన వ్యక్తికి రెండు సార్లు ఎంపి టిక్కెట్ ఇస్తే…నమ్మక ద్రోహం చేశాడు..ఆ వ్యక్తి లా నాకు అహంకారపూరిత భావజాలం లేదు. నా జీవితాంతం చంద్రబాబుగారికి, లోకేష్ కి, తెలుగుదేశంపార్టీకి రుణపడి వుంటాను. పార్టీకి సేవ చేస్తుంటాను అని శివనాథ్ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు బొప్పన భవకుమార్, తెలుగుదేశం సీనియర్ నాయకులు పండు, కార్పొరేటర్లు ఉషారాణి, అపర్ణ తో పాటు కాలనీవాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.