విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉషా ఇంటర్నేషనల్ కంపెని లిమిటెడ్ సకహారంతో వాసవ్య మహిళా మండలి నిర్వహిస్తున్న ప్రాజెక్ట్ లోకల్ రీసోర్స్ పర్సన్స్ కు రెండు రోజుల శిక్షణా తరగతులను స్థానిక వాసవ్య మహిళా మండలిలో నిరహించారు. ఈ సందర్బంగా రాజ్ కుమార్, స్టేట్ ప్రాజెక్ట్ మేనేజర్, ఉషాసలై స్కూల్ మాట్లాడుతూ ఉష కంపెణి వారు గ్రామీణ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెంది కుటుంబానికి సహాయకారిగా ఉండాలని కుట్టు శిక్షణా తరగతులు, మిషన్ మరమత్తులను నేర్పించి ఉష కుట్టు మిషన్లను ఉచితంగా మహిళలకు అందజేస్తున్నామన్నారు. అందులో భాగంగా ఈ రొండు రోజుల శిక్షణా కారక్రమాన్ని ఏర్పాటు చేశామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు గోదావరి నుండి సూర్య కుమారి, పశ్చిమ గోదావని నుండి వెంకట రామ కుమారి, యన్.టి.ఆర్ జిల్లా నుండి ఈశ్వరి దేవి, కొండమ్మ, ప్రకాశం జిల్లా నుండి సౌజన్య ఈ ఐదుగురు ట్రైనీస్ పాల్గొన్నారని, ఇక్కడ పాల్గొన్నారని, ఇక్కడ నేర్చుకున్న కుట్టులో మెలుకవలు, సాంకేతికతను వారి జిల్లాలలోని మహిళలకు శిక్షణ ను ఇస్తారని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కె.శివయ్య వాసవ్య మహిళా మండలి ప్రాజెక్ట్ మేనేజర్ ఉషా సలై స్కూల్ పాల్గొన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …