Breaking News

సి – విజిల్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు నిర్దేశిత సమయం లోపు పరిష్కరించాలి: రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా

-నోడల్ అధికారులు ఎన్నికల ఫిర్యాదులకు సంబంధించిన రిపోర్టులు సకాలంలో సంబంధిత అధికారులకు అందేలా చూడాలి : జాయింట్ కలెక్టర్ ధ్యాన చంద్ర హెచ్ యం

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
సీ – విజిల్ యాప్, ఈ ఎస్ ఎం ఎస్ ఫిర్యాదులు, ఎంసీఎంసీ ఫిర్యాదుల పరిష్కారం, సన్నద్దత, తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా రాష్ట్ర సచివాలయం సిఈఓ కార్యాలయం నుండి వర్చువల్ విధానంలో సార్వత్రిక ఎన్నికలు 2024 సన్నద్ధతకు సంబందించిన పలు అంశాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో బుధవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా తిరుపతి కలెక్టరేట్ నుండి జాయింట్ కలెక్టర్ ధ్యాన చంద్ర హెచ్ యం సంబంధిత నోడల్ అధికారులతో కలిసి హాజరయ్యారు.

ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ.. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో భాగంగా సి- విజిల్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను ఎప్పటికప్పుడు గడువులోపు పరిష్కరించేలా చూడాలని తెలిపారు. ఎన్నికల ప్రచారం కొరకు వాడే వాహనాలు, ర్యాలీల అనుమతుల కొరకు సంబంధిత రాజకీయ పార్టీల ప్రతినిధులు సువిధా యాప్ నందు దరఖాస్తు చేసుకోవాలని, అందిన సదరు దరఖాస్తులను ఎన్ కోర్ (ENCORE) యాప్ ద్వారా సంబంధిత వివిధ విభాగాల నోడల్ అధికారులు పరిశీలించి అవసరమైన అనుమతులకు చర్యలు తీసుకోవాలన్నారు. శాంతి భద్రతల పర్యవేక్షణ, సీజర్ ఆఫ్ క్యాష్, లిక్కర్, డ్రగ్స్ తదితరాలపై చెక్ పోస్టులు, స్టాటిక్ సర్వైవలెన్స్ టీంలు, సంబంధిత ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలను పటిష్టంగా అమలు చేయాలన్నారు. వీటిపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జాయింట్ కలెక్టర్ నోడల్ అధికారులతో సమావేశమై.. ఎన్నికల కమిషన్ సూచనల మేరకు ఎన్నికల విధులకు నియమించిన నోడల్ అధికారులందరూ సమన్వయంతో వారి విధులను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు. ఎన్నికల ఫిర్యాదులకు సంబంధించిన రిపోర్టులపై ప్రత్యేక దృష్టి పెట్టి సకాలంలో సంబంధిత అధికారులకు పంపేలా చూడాలని తెలిపారు. ఎన్నికల కమిషన్ ఆదేశాలకు అనుగుణంగా నోడల్ అధికారులందరూ ఎన్నికలు సజావుగా జరిగేలా కృషి చేయాలని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ నందు డిఆర్ఓ పెంచల కిషోర్, సంబంధిత నోడల్ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *