-సెంట్రల్ రిటర్నింగ్ ఆఫీసర్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మరియు పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా సంయుక్త పరిశీలన
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ IAS మరియు క్రాంతి రాణా టాటా కలిసి IPS బుధవారం విజయవాడ పరిధిలో ఉన్న చెక్ పోస్ట్ లను పరిశీలించారు.
సార్వత్రిక సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘించకుండా పలు ప్రదేశాల వద్ద ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్ లను కావాల్సిన వసతులు పరిశీలించారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాన్ని కలిసి ప్రజలు ఎవరూ ఎన్నికల ప్రవర్తన నియమావళి ( మోడల్ కోడ్ అఫ్ కండక్ట్) ఉల్లంఘించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. వాంబే కాలనీలో గల సిఆర్పిఎఫ్ బృందానికి ఏర్పాటు వసతులను పరిశీలించారు.సిఆర్పిఎఫ్ బృందంను కలిసి, వారితో ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి గురించి సంభాషించారు. స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు ఉండే సరిహద్దుల్లో చెక్ పోస్టుల ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు. ఇందులో భాగంగా రామవరపాడు రింగ్ చెక్ పోస్ట్, ముస్తాబాద్, పవర్ గ్రిడ్, పాముల కాలువ వద్ద చెక్ పోస్ట్లు లను పరిశీలించారు . తదుపరి ఆంధ్రప్రభ కాలనీలో గల పోలింగ్ బూత్లను పరిశీలించి ఎన్నికల సమయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ పర్యటనలో నగరపాలకసంస్థ ఎన్నికల సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.