గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల్లో విధులు కేటాయించబడిన ప్రతి అధికారి ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు అందుబాటులో ఉండాలని, ప్రతి ఒక్కరికీ కేటాయించిన విధుల మేరకు ప్రొసీడింగ్స్ ఇవ్వాలని మేనేజర్ ని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) కీర్తి చేకూరి ఆదేశించారు. బుధవారం కమిషనర్ చాంబర్ లో నోడల్, ఇంజినీరింగ్ అధికారులు, సూపరరిండెంట్ లతో ఎన్నికల నిర్వహణ, విధుల కేటాయింపుపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో విధులు కేటాయించబడిన సిబ్బంది ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు పూర్తి స్థాయిలో అందుబాటులోనె ఉండాలని, రిటర్నింగ్ అధికారి అనుమతి లేకుండా సెలవులు తీసుకోవడానికి వీలులేదన్నారు. కేటాయించిన విధుల మేరకు ప్రతి ఒక్కరికీ ప్రొసీడింగ్స్ ఇవ్వాలని మేనేజర్ ని ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్, హోం ఓటింగ్ లకు కూడా ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తగిన అధికారులను కేటాయించాలన్నారు. ఎన్నికల ప్రక్రియ రికార్డింగ్ చేసే వీడియోగ్రాఫర్లు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు రికార్డింగ్ చేయాలని, వారి పనిని జె.సెక్షన్ సూపరిండెంట్ మోనిటరింగ్ చేయాలన్నారు. ఏఈలు అందరూ ఈవిఎంల పనితీరు, వివిప్యాట్ ల కనెక్షన్ పై అవగాహన కల్గి ఉండాలని, అందుకు తగిన శిక్షణను మాస్టర్ ట్రైనర్ల ద్వారా అందిస్తామని తెలిపారు. ఫ్లైయింగ్ స్క్వాడ్ టీంలు తమకు కేటాయించిన విధుల్లో భాగంగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలుని క్షేత్ర స్థాయిలో మరింత పటిష్టంగా అమలు చేయాలన్నారు. సమావేశంలో సెక్టోరల్ అధికారి శ్రీధర్, ఏఆర్ఓలు సునీల్, భీమరాజు, ఎస్.ఈ. శ్యాం సుందర్, మేనేజర్ ఎస్.ఎన్.ప్రసాద్, సూపరిండెంట్లు, ఈఈలు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …