-డిసెంబర్ నెల నుంచే ఎన్నికల అమలు ప్రక్రియ ప్రారంభించడం జరిగింది
-రీజియన్ పరిధిలోని ఆరు జిల్లాలలో కలెక్టర్లతో సమన్వయం చేసుకోవడం జరుగుతోంది
-ఐ. జి – జి.వి. జి. అశోక్ కుమార్
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్నికల ప్రవర్తన నియమా వళిని పగడ్బందీగా అమలు చేసే విధంగా చర్యలు తీసుకుం టున్నామని ఏలూరు రేంజ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ జి.వి. జి. అశోక్ కుమార్ అన్నారు. గురువారం కొవ్వూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో డి.ఎస్.పి, కొవ్వూరు టౌన్, రూరల్ పరిధిలో వార్షిక తనిఖీలు నిర్వహించడం లో భాగంగా పర్యటించడం జరిగింది.
ఈ సందర్భంగా ఐజి .. జివిజీ అశోక్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల కమీషన్ మార్గదర్శకా లను అనుసరించి ఎన్నికల ప్రవర్తనా నియమావళిని అనుసరించి జిల్లా కలెక్టర్ లతో ఆరు జిల్లాల ఎస్పీలు సమన్వయం చేసుకోవడం జరిగిందనీ అన్నారు. ప్రతి జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియ మావళి పై శిక్ష ణా తరగతులు నిర్వహించడం జరిగిందన్నారు. జిల్లాలో వీఐపీలు, ప్రజా ప్రతినిధులు పర్యటించి నప్పుడు సెక్యూరిటీ పరంగా బందోబస్తులు పకడ్బందీగా నిర్వహించేందుకు కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. డిసెంబర్ నెల నుంచే ఎన్నికల షెడ్యూలు విడుదల కాకుండానే ఎన్ఫోర్స్మెంట్ అమలు ప్రక్రియ ప్రారంభించడం జరిగింది. ఆరు జిల్లాల పరిధిలో 1842 నాన్ బెయిలబుల్ వారెంట్ ఎక్జిక్యూట్ చేయడం జరిగిందన్నారు.ఐ డి లిక్కర్, పులిసిన బెల్లం ఊట, ఎన్ డీ పీఏల్ సీసాలు, టెట్రా ప్యాకెట్లు, డి పి ఎల్ (గంజా), ఎన్ డి పి ఎస్, క్యాష్, ప్రీసియస్ మేటల్, ఫ్రీ బీస్ తదితరాలు చెంది 7489 ఎఫ్ ఐ ఆర్ లు నమోదు చేసి, 4067 మందిని అరెస్ట్ చేసి ₹.15,53,74,279 /- లు విలువ కలిగినవాటిని సీజ్ చేశామన్నారు. ఎన్నికల నేపథ్యంలో మద్యం, డబ్బు ప్రభావాన్ని తగ్గించడానికి దాడులు మరింత తీవ్ర తరం చెయ్యడం జరిగిందన్నారు. ఎన్నికల పోలింగ్, కౌంటింగ్ సరళి పై పోలీసు సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహించామన్నారు.
ఈ సందర్భంలో తూర్పు గోదావరి జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి. జగదీష్ , కొవ్వూరు డివిజన్ డి.ఎస్.పి కే. సిహెచ్. రామారావు, కొవ్వూరు టౌన్ ఇన్స్పెక్టర్ వి. జగదీశ్వర్ రావు, కొవ్వూరు రూరల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పి. శ్రీనివాసరావు, తదితరులు ఉన్నారు.