Breaking News

ఎన్నికల సంసిద్ధతకు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నాం : కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా. జి. లక్ష్మీ శ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుండి సోమవారం ఎన్నికల సంసిద్ధత, పోస్టల్ బ్యాలెట్ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ మరియు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా గారు సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేయగా తిరుపతి జిల్లా కలెక్టరేట్ నుండి కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ సంబంధిత అధికారులతో కలిసి హాజరై ఎన్నికల మార్గదర్శకాల మేరకు జిల్లాలో సాధారణ ఎన్నికలు 2024 నిర్వహణకు అన్ని విధాలా చర్యలు చేపడుతున్నామని వివరించారు.

ఈ సందర్భంగా సిఈఓ మాట్లాడుతూ పోస్టల్ బ్యాలెట్ అండ్ హోం ఓటింగ్ కు సంబంధించి అధికారుల బాధ్యతలు మరియు వారు నిర్వహించాల్సిన విధులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివరించారు. పోస్టల్ బ్యాలెట్ అండ్ హోం ఓటింగ్ కు సంబంధించి ఏప్రిల్ మరియు మే మాసాల్లో నిర్వహించనున్న కార్యక్రమాలను, ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, పోలీసులు ఇతర సిబ్బందికి పోస్టల్ బ్యాలట్ సౌకర్యాలు కల్పించడం, అందుకు అవసరమైన ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాటు తదితర అంశాలపై కలెక్టర్ గారు సిఈఓ కు వివరించారు.

ఈ కార్యక్రమంలో డి ఆర్ ఓ పెంచల కిషోర్, ఈ ఆర్ ఓ అదితి సింగ్, నిషాంత్ రెడ్డి, చంద్రముని, నరసింహులు, ఎన్నికల నోడల్ అధికారులు, ఎన్నికల సెక్షన్ సూపరింటెండెంట్ చంద్ర శేఖర్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *