Breaking News

అత్యవసర సేవలు అందించే 33 శాఖల ఉద్యోగులకు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటుతో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అవకాశం : కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
భారత ఎన్నికల కమీషన్ వారి ఆదేశాల మేరకు ప్రస్తుతం జరగబోవు సాధారణ ఎన్నికలు 2024 నందు అత్యవసర శాఖల ఉద్యోగులకు వారు పోలింగ్ తేదీ నాడు విధులలో ఉండే అవకాశం ఉన్నవారికి సంబంధిత ఓటు కలిగిన ఆర్.ఓ, ఎఆర్ఓ వద్ద ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటుతో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించనున్నామని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి డా.జి. లక్ష్మీ శ పేర్కొన్నారు.

సోమవారం స్థానిక కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు సమావేశంలో కలెక్టర్ గారు మాట్లాడుతూ అత్యవసర సేవలు అందించే 33 శాఖల ఉద్యోగులు వారు పోలింగ్ తేదీ మే13 న వారి శాఖల విధులలో ఉండి ఓటు ఆ దినం వేయలేని వారు సంబంధిత శాఖల నోడల్ అధికారి ద్వారా ఫారం 12డి పూరించి డిపార్ట్మెంట్ ఐ.డి, ఎపిక్ కార్డు జత పరిచి సదరు ఓటు కలిగిన ఆర్.ఓ, ఎఆర్ఓ కు ఏప్రిల్ 22 లోపు అందచేయాలని అన్నారు. జిల్లా ఎన్నికల అధికారి గారు సూచించిన తేదీలలో సంబంధిత ఆర్.ఓ, ఎఆర్ఓ వద్ద ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటుతో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సౌకర్యం కల్పించడం జరుగుతుందని, అప్పుడు సదరు ఉద్యోగులు వెళ్లి అక్కడ తమ ఓటును మార్క్ చేసి డ్రాప్ బాక్స్ లో వేయాల్సి ఉంటుందనీ, ఆయా శాఖల హెచ్ఓడిలతో కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సంబంధిత అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించి అవగాహన కల్పించారు. పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి 12D ఫారం పంపిన సదరు ఉద్యోగి పోస్టల్ బ్యాలెట్ ను వినియోగించుకోకపోతే పోలింగ్ తేదీ మే13 నాడు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉండదని తెలిపారు. సాధారణ ఎన్నికల్లో అత్యవసర సేవలు అందించే 33 శాఖల ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తూ ఎన్నికల సంఘం నోటిఫై చేసిన నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు వారి శాఖ నుండి ఒక నోడల్ అధికారిని ఏర్పాటు చేసి సదరు వివరాలు త్వరితగతిన అందచేయాలని తెలిపారు. వారు పోస్టల్ బ్యాలెట్ విషయమై ఆయా శాఖల పరిధిలో ఉద్యోగులకు అవగాహన కల్పించి వారు సంబంధిత ఫారం 12D ని పూరించి, ఎపిక్, డిపార్ట్మెంట్ ఐడి జతపరచి నిబంధనల మేరకు ఏప్రిల్ 22 లోపు సంబంధిత ఆర్ఓ / ఎఆర్ఓ లకు అందేలా సంబంధిత శాఖల నోడల్ అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు.
సాధారణ ఎన్నికల్లో అత్యవసర సేవలు అందించే 33 శాఖల వివరాలు.. 1.మెట్రో, 2. రైల్వే రవాణా (ప్రయాణికుల మరియు సరుకు రవాణా) సేవలు, 3. పోలింగ్ రోజు కార్యకలాపాలను కవర్ చేయడానికి కమిషన్ ఆమోదంతో అధికార లేఖలు జారీ చేయబడిన మీడియా వ్యక్తులు 4. విద్యుత్ శాఖ, 5. BSNL, 6. పోస్టల్ & టెలిగ్రామ్, 7.దూరదర్శన్, 8. ఆల్ ఇండియా రేడియో, 9. రాష్ట్ర మిల్క్ యూనియన్ మరియు మిల్క్ కోఆపరేటివ్ సొసైటీలు, 10. ఆరోగ్య శాఖ, 11. ఫుడ్ కార్పొరేషన్ డిపార్ట్‌మెంట్, 12. విమానయానం, 13. రోడ్డు రవాణా సంస్థ, 14. అగ్నిమాపక సేవలు, 15. ట్రాఫిక్ పోలీస్, 16. అంబులెన్స్ సేవలు, 17. షిప్పింగ్, 18. ఫైర్ ఫోర్స్, 19. జైలు, 20.ఎక్సైజ్, 21. వాటర్ అథారిటీ, 22. ట్రెజరీ సర్వీస్, 23. అటవీ, 24. సమాచార మరియు ప్రజా సంబంధాల శాఖ, 25. పోలీసు, 26. పౌర రక్షణ మరియు హోంగార్డులు, 27. ఆహార పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాలు, 28. శక్తి, 29. ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, 30. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో 31. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ 32. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్స్, 33. విపత్తు నిర్వహణ శాఖలను నోటిఫై చేయుచు ఉత్తర్వులు జారీ చేసి ఉన్నారన్నారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *