-ప్రతి ఒక్క ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.
-జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 16,50,000 మంది ఓటర్లు
-బైక్ ర్యాలీలో పాల్గొన్న ఎస్పీ, జాయింట్ కలెక్టర్
-రాజమండ్రీ రూరల్ నియోజక పరిధిలో స్వీప్ కార్యక్రమం
-జిల్లా కలెక్టర్/ జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
2024 సార్వత్రికా ఎన్నికలను పురస్కరించుకొని ఎన్నికల కమీషన్ నిర్దేశించిన షెడ్యూల్ మే 13వ తేదీ జరగనున్న పోలింగ్ లో ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కే. మాధవీలత పిలుపు నిచ్చారు.
సోమవారం ఉదయం స్థానిక గోదావరీ నదీ పరివాహక ప్రాంతంలోనీ రివర్ బే ప్రాంతం నుంచి డి మార్ట్ వరకు ఓటర్ల అవగాహాన పై మోటర్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు . రాజమండ్రీ రూరల్ నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి నియోజక వర్గ పరిధిలో ఏర్పాటు చేసిన ఈ బైక్ ర్యాలీని కలెక్టర్ మాధవీలత, ఎస్పి జగదీష్, జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్, తదితరులు కలిసి ప్రారంభించడం జరిగింది. తొలుత జెండా ఊపి కలెక్టర్ ర్యాలీ ని ప్రారంభించారు.
ఈ సందర్బంగా కలెక్టర్ డా. మాధవీ లత మాట్లాడుతూ జిల్లా లో గత ఏడాదిగా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించే విధంగా ఓటర్ నమోదు కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రజలను చైతన్య పరుస్తూ అర్హులైన అందరినీ ఓటర్ గా నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. జిల్లాలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో సుమారు 16,10,000 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో జరిగిన పోలింగ్ శాతాన్ని పరిశీలిస్తే రూరల్లో ఎక్కువ శాతం అర్బన్ లో తక్కువ శాతం పోలింగ్ నమోదు అవుతుందన్నారు. పోలింగ్ రోజున ప్రభుత్వం సెలవు దినముగా ప్రకటిస్తుంది కనుక ప్రతి ఒక్కరూ తమ అమూల్యమైన ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అన్ని ప్రాంతాల్లో ఆయా ఓటర్ లకు అందుబాటులోనే పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని కావున ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకొని పోలింగ్ శాతాన్ని పెంచాలని పేర్కొన్నారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు ఎటువంటి అసౌకర్యం లేకుండా స్పష్టం చేశారు. మన హక్కులను ఎలా ప్రశ్నిస్తామో.. అదేవిధంగా అర్హులైన ప్రతి ఒక్కరూ మే 13 వ తేదీన ముందుకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకొని ప్రజాస్వామ్యాన్ని. పరిరక్షించాలని పిలుపునిచ్చారు. ఈ రోజు ఇంత పెద్ద ఎత్తున ఓటర్ నమోదు అవగాహన సదస్సును నిర్వహిస్తున్న రూరల్ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి మరియు జాయింట్ కలెక్టర్, డి ఎస్ పి, వారి సిబ్బంది అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూన్నా అన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లు భాగస్వామ్యం, ఓటు హక్కును వినియోగించుకోవడం పై అవగాహన ర్యాలీనీ జరుపు కోవడం జరిగిందనీ జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పి. జగదీష్ పేర్కొన్నారు. ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఓటింగు శాతం పెరిగేలా చర్యలు తీసుకోవడం అన్నారు. అందుకు అనుగుణంగా పోలీస్ శాఖ అధ్వర్యంలో స్వేచ్ఛగా నిర్భయంగా ఓటు హక్కును వినియోగించు కొవడానికి గానూ ఓటర్లలో విశ్వాసాన్ని పెంపొందించడం జరుగుతోందని అన్నారు. అందులో భాగంగానే కేంద్ర బలగాలు అధ్వర్యంలో సమస్యాత్మక, అతి సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద, గతంలో జరిగిన ఎన్నికలలో ఘటనలు జరిగిన ప్రాంతాల్లో పోలిస్ కవాతు ప్రదర్శన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజలు ఎటువంటి భయం లేకుండా నిర్భయంగా పోలింగ్ కేంద్రానికి వొచ్చి ఓటు వేసుకోవచ్చు అనీ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేసి, నిఘా పెట్టడం జరిగిందన్నారు. ఓటర్లను ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా ముందాస్తు చర్యలు తీసుకోవడం, డబ్బు, మద్యం, తదితర వాటినీ సీజ్ చెయ్యడం జరుగుతోందని అన్నారు. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్ కేంద్రాలకు వొచ్చి ఓటు వేయాలని ఎస్పి జగదీష్ విజ్ఞప్తి చేశారు.
రూరల్ నియోజకవర్గం రిటర్నిగ్ అధికారి మరియు జాయింట్ కలెక్టర్ ఎన్. తేజ్ భరత్ మాట్లాడుతూ ఓటర్ నమోదు అవగాహన (స్వీప్ యాక్టివిటీ ) కార్యక్రమంలో భాగంగా ఓటర్లను చైతన్య పరచడంతో పాటు అవగాహన కల్పించే విధంగా ఓటర్ నమోదు ప్రక్రియపై నిర్వహించిన బైక్ ర్యాలీ లో బిఎల్ఓ లు, రెవెన్యూ సివిల్ సప్లై అధికారులు ఇతర సిబ్బంది అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు మేరకు మే 13 న పోలింగ్ నిర్వహించిన ఉన్నామని అందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. గత ఎన్నికల్లో జిల్లాలో 76 శాతం పోలింగ్ నమోదు కాగా,రాజమండ్రి రూరల్ నియోజకవర్గం లో 73 శాతం మాత్రమే నమోదు అయ్యిందన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గం అర్బన్ ప్రాంతంలో 46 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, ప్రజలందరూ ప్రతి ఒక్కరు మే 13 వ తేదీని
సెలవు దినంగా చూడకుండా బాధ్యతయుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు రూరల్ నియోజక వర్గం అర్బన్ ప్రాంతంలో వాటర్ నమోదు అవగాహన సదస్సు బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించు కోవడం జరిగిందని పేర్కొన్నారు.
పాల్గోన్న అధికారులు ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ పి. సువర్ణ, సహయ రిటర్నింగ్ అధికారులు/తహశీల్దార్లు వై. కె. వి. అప్పారావు , బి. రమాదేవి, డిఎస్పీ ఎమ్. వెంకటేశ్వర్లు, ఎమ్. అంబికా ప్రసాద్, సి ఐ లు, డిప్యూటీ తహసీల్దార్ ఎమ్ కే సుధీర్, సూపర్ వైజర్ లు, బి ఎల్ వో లు, పౌర సరఫరాల అధికారులు, సిబ్బంది, నగర ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు.