Breaking News

హోం ఓటింగు కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలి

-ఆబ్సెంట్ ఓటర్ల జాబితా, అనుబంధ నిర్థారణ పత్రాలు
-నియోజక వర్గ పరిధిలో హోం ఓటింగు ఓటర్లు 4,285
-ఆర్వో సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కొవ్వూరు నియోజక వర్గ పరిధిలో హోం ఓటింగు, అబ్సెంటీ ఓటర్ల జాబితా మేరకు క్షేత్ర స్థాయిలో పరిశీలించి, రానున్న సార్వత్రిక ఎన్నికల లో ఓటింగు శాతం పెరిగేలా ప్రత్యేక కార్యచరణ సిద్దం చేసుకొని అమలు చెయ్యాలని కొవ్వూరు నియోజక వర్గ రిటర్నింగ్ అధికారి, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ పేర్కొన్నారు.

సోమవారం స్థానిక సుందర సాయి కళ్యాణ మంటపం లో రిటర్నింగ్ అధికారి – 54- కొవ్వూరు సెక్టార్ అధికారులు, సూపర్ వైజర్ లు,బూత్ స్థాయి అధికారులతో హోమ్ ఇంటి ఓటింగ్‌ , అబ్సెంటీ ఓటర్ల గుర్తింపు, తదుపరి కార్యాచరణ పై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు .

ఈ సందర్భంగా ఆర్వో , సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ మాట్లాడుతూ, రానున్న సార్వత్రిక ఎన్నికలలో కొవ్వూరు నియోజక వర్గం పరిధిలో ఓటింగు శాతం పెరిగేలా ప్రతీ ఒక్కరూ నిబద్దత కలిగి పని తీరు ఆచరణ లో చూపాల్సి ఉంటుందనీ అన్నారు. ఎన్నికల కమీషన్ తీసుకున్న చర్యల లో భాగంగా 85 ఏళ్లు నిండిన ఓటర్లు, 40 శాతం పైబడిన దివ్యాంగా ఓటర్ల ఐచ్చికం మేరకు 12 డి ఫారం ద్వారా అంగీకారం తెలిపిన వారికి ఇంటి వద్దనే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించనున్నట్లు ఆయన తెలిపారు.

కొవ్వూరు నియోజక వర్గ పరిధిలోని ఉన్న 176 పోలింగ్ కేంద్రాలలో 85 ఏళ్లు నిండిన 583 ఓటర్లు, 40 శాతం పైబడిన దివ్యాంగ ఓటర్లు 2393 ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. ఓటర్ల ఐచ్చికం మేరకు పోలింగు కేంద్రానికి వొచ్చి లేదా ఇంటి వద్దనే ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉందని తెలిపారు. పోలింగు కేంద్రానికి రాలేని వారికీ వారీ నుంచీ ఆమేరకు 12 డి ఫారం ద్వారా ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు మేరకు బి ఎల్ వో లు అంగీకారం పత్రం తీసుకుని ఆమేరకు ఓటు హక్కును కల్పించాల్సి ఉంటుందన్నారు. ఈ ప్రక్రియలో బీ ఎల్ వో లు , ఇతర అధికారులు ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు.

ఎన్నికల ప్రక్రియలో భాగస్వామ్యం అయ్యే పి వో లు, అనుబంధ సిబ్బంది, రిజర్వ్ తో కూడి 1309 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కలుగ చేయనున్నట్లు తెలిపారు. వారీ నుంచి ఫారం 12 ద్వారా డిక్లరేషన్ పొందవలసి ఉంటుందన్నారు. మొదటి శిక్షణ కార్యక్రమం సందర్భంలో ఆమేరకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోస్టల్ బ్యాలెట్, అబ్సేంటి ఓటింగ్ పై కేంద్ర ఎన్నికల మార్గదర్శకాలు పై పిపిటి ద్వారా సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది

ఈ సమావేశంలో సహాయ రిటర్నింగ్ అధికారులు -కొవ్వూరు తహసీల్దార్ కే. మస్తాన్, చాగల్లు ఎమ్ . సావిత్రి , తాళ్లపూడి సీ హెచ్. శ్రీనివాస్, కొవ్వూరు మునిసిపల్ కమిషనర్ కే. డానియల్ జోసెఫ్ , సెక్టార్ అధికారులు, సూపర్ వైజర్ లు, బి ఎల్ వో లు,, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *