-నియోజక వర్గాల స్ధాయిలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది
-కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఎన్నికల విధుల్లో బాధ్యతలు చేపట్టే పోలింగ్ అధికారులకి, సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ , హోం ఓటింగు సంబంధించిన నిర్దుష్టమైన కార్యచరణ రూపొందించడం, శిక్షణా తరగతులు నిర్వహించడం జరిగిందనీ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత తెలియ చేశారు.
సోమవారం వెలగపూడి నుంచీ పోస్టల్ బ్యాలెట్ అండ్ హోం ఓటింగ్ కు సంబంధించి అధికారుల బాధ్యతలు, నిర్వహించాల్సిన విధులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రాష్ట్ర సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల ఎన్నికల అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా దిశా నిర్దేశనం చేశారు. ఆయా జిల్లా ఎన్నికల అధికారుల సూచనలూ తెలియ చెయ్యడం జరిగింది. వైఎస్సార్ జిల్లా ఎన్నికల అధికారి వి. విజయ రామ రాజు రూపొందించిన ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లోని పలు అంశాలను ఈ వీడియో కాన్ఫరెన్స్లో చర్చించారు. పోస్టల్ బ్యాలెట్ అండ్ హోం ఓటింగ్ కు సంబంధించి ఏప్రిల్ మరియు మే మాసాల్లో తేదీల వారీగా నిర్వహించాల్సిన కార్యక్రమాలను, ఎన్నికల విధులు నిర్వహించే ఉద్యోగులు, పోలీసులు ఇతర సిబ్బందికి పోస్టల్ బ్యాలెట్ సౌకర్యాలు కల్పించడం, అందుకు అవసరమైన ఫెసిలిటేషన్ సెంటర్ల ఏర్పాటు తదితర అంశాల గురించి సమగ్ర సమాచారం అందచేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత వివరాలు తెలియచేస్తూ, జిల్లా వ్యాప్తంగా రిజర్వ్ ఎన్నికల సిబ్బంది తో కలిసి 11,334 మంది ఆబ్సెంటి ఓటర్లు , 85 ప్లస్ ఓటర్లు 11514 , పి డబ్ల్యు డి ఓటర్లు 19,690 మంది ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో వివిధ నియోజక వర్గాలు పరిధిలో హోం ఓటింగ్ కి సంబందించి సహేతుకమైన వివరాలు సేకరించి ఫారం 12 డి ద్వారా ధృవీకరణ పత్రాలను సేకరించడం జరుగుతున్నట్లు తెలిపారు.
ఈ సమావేశంలో రాజమండ్రీ రూరల్ ఆర్వో జె సి – ఎన్. తేజ్ భరత్, కొవ్వూరు ఆర్వో , సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవ్ , రాజానగరం ఆర్వో/ ఆర్డీఓ ఏ. చైత్ర వర్షిణి, గోపాలపురం ఆర్వో – కె ఎల్ శివజ్యోతి, నిడదవోలు ఆర్వో – ఆర్ వి రమణా నాయక్ , ఎమ్. మాధురీ , కే ఆర్ ఆర్ సి – ఎస్.డి.సి. ఆర్. కృష్ణా నాయక్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్లు ఎమ్. భాను ప్రకాష్, పి . సువర్ణ లు పాల్గొన్నారు.