Breaking News

సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవడం జరిగింది

-రానున్న రోజుల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే నేపద్యంలో ముందస్తు
-వేసవి కాలంలో ఎటువంటి త్రాగునీరు ఇబ్బందులు లేకుండా చర్యలు
-ఉపాథి హామీ పనులు సమయంలో పని గంటలలో మార్పులు
-కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సోమవారం ఉదయం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె యస్ జవహర్ రెడ్డి విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ లతో సామజిక భద్రత పెన్షన్ పంపిణీ, వేసవి దృష్ట్యా అధిక ఉష్ణోగ్రతలు, ఉపాధి హామీ, త్రాగునీరు సరఫరా ఏర్పాట్ల పై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, సామాజిక భద్రత పెన్షన్ పంపిణీ చేయడానికి ఉన్నతాధికారుల ఆదేశాలకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందనీ తెలిపారు. అందులో భాగంగా సమన్వయ శాఖల అధికారులు సచివాలయాలు ద్వారా పంపిణీ చేయడానికి కార్యచరణ రూపొందించడానికి సంసిద్ధంగా ఉండాలని స్పష్టం చేశామన్నారు.

వేసవి దృష్ట్యా త్రాగునీరు సరఫరా ఎటువంటి ఇబ్బందులూ లేకుండా ముందస్తు చర్యలు, సమన్వయం చేసుకోవడం పై దృష్టి పెట్టాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.  రానున్న రోజుల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందనీ రాష్ట్ర విపత్తుల నివారణ సంస్ధ హెచ్చరికలు జారీ నేపథ్యంలో అత్యంత ప్రాధాన్యత ఇస్తూ, త్రాగునీటి సరఫరాకు ఎటువంటి ఆటంకాలు లేకుండా చూసుకోవాలి అని పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ అధ్వర్యంలో తగిన ముందస్తు జాగ్రత్తలు, తగిన రీతిలో ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు, ఇతర అత్యవసర మందులను అందుబాటులో ఉంచడం జరుగుతుందనీ తెలిపారు. విద్యుత్ సరఫరా లో ఎటువంటి ఆటంకాలు లేకుండా తగిన భద్రత ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్నారు.

ఈ సమావేశంలో డి ఆర్ డీ ఏ పిడి ఎన్ వివిఎస్ మూర్తి, ఆర్ డబ్ల్యూ ఎస్ ఏస్ ఈ – డి. బాలశంకర్ రావు, డ్వామా పీడీ ఏ. ముఖలింగం , ఆఆర్ ఎమ్ సి ఎస్ ఈ జి. సాంబశివ రావు, ఏస్ ఈ ఏపిఈ పి డి సి ఎల్ టి వి ఎస్ ఎన్ మూర్తి, జిల్లా పశు సంవర్ధక అధికారి డా శ్రీనివాస్ రావు, డి ఎమ్ హెచ్ వో డా కె. వేంకటేశ్వర రావు, డి పి వో డి. రాంబాబు , సహయ కార్మిక కమీషనర్ బి ఎస్ ఎమ్ వలీ , ఇతర అధికారులు ఏస్. మాధవ రావు, డా ఎన్. వసుంధర, బి. సుజాత, కె. వాసు దేవరావు, ఆర్ ఎమ్ సీ ఈ ఈ ఆలీ, తదితరులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *