రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ ను పటిష్టంగా అమలు పరచడం పై ఎన్ఫోర్స్ మెంట్ శాఖల అధికారులు, సిబ్బంది విధుల్లో జవాబుదారీ తనం , ఖచ్చితత్వం కలిగి ఉండాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత స్పష్టం చేశారు. సోమవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో ఎన్నికల నిర్భంద నిర్వహణ వ్యవస్థ (ESMS) పనితీరుపై సిజర్ నోడల్ ఏజెన్సీ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు .
ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ఎన్నికల నేపథ్యంలో క్షేత్ర స్థాయిలో నేరుగా అడ్డగించబడిన/సీజ్ చేయబడిన వస్తువుల (నగదు/మద్యం/మాదక ద్రవ్యాలు/ విలువైన మెటల్/ఉచితాలు/ఇతర వస్తువులు) డేటాను డిజిటలైజ్ ఎప్పటి కప్పుడు చెయ్యాలన్నారు. గత ఏడాది ఇదే సందర్భంలో జరిగిన లావా దేవిలు, ప్రస్తుతం జరుపుతున్న లావాదేవీలు ఆధారంగా చేసుకుని డేటా ను విశ్లేషణ చేయాల్సి ఉంటుందని మాధవీలత పేర్కొన్నారు. అటువంటి అధిక మొత్తంలో జరిగిన వారిపై నిఘా పెట్టడం లో ఎన్ఫోర్స్ మెంట్ శాఖల అధికారులు, సిబ్బంది నిబద్దత కలిగి ఉండాలనీ స్పష్టం చేశారు. రైల్వే లు, రోడ్డు రవాణా ద్వారా తరలింపును చెయ్యడం జరుగుతోందని, తూర్పు గోదావరి జిల్లా ప్రధాన మార్గంలో ఉందన్నారు. పై ప్రాంతాల నుండి వచ్చే అటువంటి సరుకులు, వస్తువులు, నగదు, మద్యం వంటివి మన జిల్లా మీదుగా తరలించే అవకాశాలు ఉన్న దృష్ట్యా జిల్లాలోని ఎన్ఫోర్స్ మెంట్ శాఖల పై మరింత ఎక్కువగా బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు జరిగిన దాడుల్లో ₹.28,89,810 నగదు సీజ్ చేసి, తగిన ఆధారాల మేరకు నిర్ణయం తీసుకోవడం జరుగుతున్నట్లు తెలిపారు. సరుకుల సీజింగ్ చేసే క్రమంలో వాటినీ స్వాధీన పరీచే క్రమంలో అనుబంధ శాఖల అధికారులతో దర్యాప్తు అత్యంత ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. నిజ నిర్ధారణ చేసిన తర్వాత మాత్రమే సీజింగ్ చేసిన వస్తువులు గానీ, నగదు గానీ విడుదల చెయ్యడం జరగాలన్నారు. ఇటువంటి ఘటనలు సందర్భంలో విధుల్లో బాధ్యతారాహిత్యంగా వహిస్తే ఎన్నికల కమీషన్ మార్గదర్శకాలను అనుసరించి వ్యవహరించాల్సి ఉంటుందనీ హెచ్చరించారు. జిల్లాలో లావాదేవీలు, సరుకుల రవాణా, నగదు బదలీ లపై మరింత నిఘా పెట్టడం, చెక్ పోస్టులు యందు కట్టుదిట్టమైన తనిఖీ వ్యవస్థ ను పటిష్టం చేయాలన్నారు. ఎన్నికల ఇన్ కమ్ టాక్స్ శాఖల అధికారులు నగదు సీజింగ్, విడుదల చెయ్యడం లో మార్గదర్శకాలు విషయంలో ఏదైనా వివరణ తీసుకోవాల్సి ఉంటే సంభందిత వివరాలు పై సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించాలని పేర్కొన్నారు. రాష్ట్ర జీ ఎస్ టి అధ్వర్యంలో జిల్లాకు వస్తున్న వివిధ కంటెన్మెంట్ లు వాస్తవ పరిస్థితి కి అనుగుణంగా ఉన్నాయో లేదో రికార్డులను పరిశీలించి, నివేదిక అందజేయాలని ఆదేశించారు.
రూ.50 వేలు మించి నగదు వెంట తీసుకుని వెళ్ళే సందర్భంలో తగిన ఆధారాలు తప్పనిసరి అని, రాజమహేంద్రవరం అర్బన్ లో ఇద్దరూ నుంచీ సీజ్ చేసిన రూ.2 లక్షలు అనపర్తి కి చెందిన ఒక వ్యక్తి నుంచి రు.1,27,860 /- , నిడదవోలు కి చెందిన మరో వ్యక్తి నుంచి రూ. లక్షా యాభై వేలు సీజ్ చెయ్యడం జరుగిందని వారీ నుంచీ తగిన ఆధారాలు స్వీకరించిన అనంతరము, సీజ్ చేసిన మొత్తం విడుదల చెయ్యడం కోసం చర్యలు తీసుకోవడం జరిగింది అని పేర్కొన్నారు. రాజమహేంద్రవరం అర్బన్ కి చెందిన మరో వ్యక్తి నుంచి సీజ్ చేసిన రు.90 వేలు కి సంభందించి ఆధారాలు కోరడం జరిగిందన్నారు. సీజ్ చేసిన వాటికి చెందిన ఆయా శాఖల మార్గదర్శకాల మేరకు విడుదల చెయ్యడం జరిగిందని తెలిపారు. రైల్వే, ఇతర రవాణా మార్గాలలో వస్తున్న వాటికి చెందిన నివేదికలు విషయంలో ఒకే నిర్దుష్ట ప్రొఫార్మా సిద్దం చేసి ఆమేరకు నివేదిక అందజేయాలని నోడల్ అధికారి , జిల్లా ఆడిట్ అధికారి కే వి వేంకటేశ్వర రావు తెలియ చేశారు.
ఈ సమావేశంలో జిల్లా సీజర్ నోడల్ అధికారి , జిల్లా ఆడిట్ అధికారి కే వి వేంకటేశ్వర రావు , సేబ్ అధికారులు పి. సోమ శేఖర్, కే. జయ మౌనిక, ఎల్ డి ఎమ్ డివి ప్రసాద్, ఐటి అధికారులు శీలం వీరబాబు, బి వి సుబ్బా రెడ్డి, రాష్ట్ర జీ ఎస్టీ, రైల్వే అధికారులు తదితరులు పాల్గొన్నారు.