గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను వేగంగా చేపట్టాలని నగర కమీషనర్,గుంటూరు తూర్పు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్ల పై సోమవారం కమీషనర్ ఛాంబర్ లో ఆయా విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కమీషనర్ మరియు ఆర్.ఓ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఈ.వి.యం ల డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి పోలింగ్ కేంద్రాలకు ఈ.వి.యం లను తరలించడానికి రూట్ ఆఫీసర్లతో సమనవ్యం చేసుకుంటూ అవసరమైన వాహనాలను ముందుగానే సిద్దం చేయాలని ఆదేశించారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ లో మౌలిక వసతులు, ఇతర ఏర్పాట్లను వేగంగా పూర్తి చేసేలా ఏ.ఆర్.ఓ లు పర్యవేక్షన చేయాలని, క్షేత్ర స్తాయిలో ఏ సమస్య ఎదురైనా తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఎన్నికల విధుల్లో ఉండే ప్రభుత్వ ఉద్యోగులు వినియోగించుకునే పోస్టల్ బ్యాలెట్ కు అధికారులు మరియు సిబ్బందిని కేటాయించాలన్నారు. మోడల్ కోడ్ అఫ్ కండక్ట్, ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు మరింత విస్తృతంగా పర్యటిస్తూ, క్షేత్ర స్తాయిలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయటం, అనుమతి లేని ప్రచార సామగ్రి మరియి వాహనాలు సీజ్ చేయాలన్నారు. ఎన్నిక నియమావళి ఉల్లంఘించే వారిపై యఫ్.ఐ.ఆర్ లు ఫైల్ చేయడంలో పోలీస్ శాఖతో సమన్వయం చేసుకొని జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఏ.ఆర్.ఓ లను ఆదేశించారు. సమావేశంలో సెక్టోరల్ అధికారి శ్రీధర్, ఏ.ఆర్.ఓ లు సునీల్, భీమరాజు, డిప్యుటీ కమీషనర్ వెంకట కృష్ణయ్య,ఈ.ఈ సుందర రామి రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …