గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఈవిఎంల కమిషనింగ్, పంపిణీ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ ల్లో తగిన ఏర్పాట్లు తక్షణం చేపట్టాలని నగర పాలక సంస్థ అదనపు కమీషనర్ మరియు పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి (ఆర్ఓ) కె. రాజ్యలక్ష్మి అధికారులను ఆదేశించారు. సోమవారం స్థానిక లాడ్జ్ సెంటర్ నందలి ఏ.యల్ బి.ఈడి కాలేజీలోని మీటింగ్ హాల్స్, తరగతి గదులను ఈవిఎంల కమిషనింగ్, పంపిణీ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్ ల కోసం అధికారులతో కలిసి అదనపు కమిషనర్ పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ & ఆర్ఓ మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో వినియోగించే ఈవిఎంలు, వివి ప్యాట్ ల కమిషనింగ్, స్ట్రాంగ్ రూమ్, పంపిణీ కేంద్రాలను స్థానిక బి.ఈడి కాలేజిలో ఏర్పాటు చేయనున్నామని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈవిఎంలను భద్ర పరిచే స్ట్రాంగ్ రూమ్ లను ఆయా విభాగాల ఉన్నతాధికారులు, ఏఆర్ఓలు ప్రత్యక్ష పరిశీలన చేయాలని, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ నుండి కమిషనింగ్ కేంద్రానికి అసెంబ్లీ, పార్లమెంటు ఈవిఎంలను వేరుగా తెచ్చేలా బ్యారికేడింగ్ చేపట్టాలని, అవసరమైన విద్యుత్, త్రాగునీరు వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు.
పర్యటనలో ఏఆర్ఓలు సి.హెచ్ శ్రీనివాస్, సీనా రెడ్డి,నిరంజన్, కుమార్, ఎ.ఈ.ఆర్.ఓ శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ సాంబశివరావు, పట్టణ ప్రణాళిక, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …