గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
ఆస్తి పన్ను వసూళ్ళల్లో గుంటూరు నగరపాలక సంస్థ రాష్ట్ర స్థాయిలో తృతీయ స్థానంలో నిలిచిందని, చివరి రోజు రూ.5.09 కోట్లు వసూళ్లు చేసి ద్వితీయ స్థానంలో నిలిచిందని నగర కమిషనర్ కీర్తి చేకూరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, ఆస్తి పన్నుపై వడ్డీ రాయితీని నగర ప్రజలు విరివిగా సద్వినియోగం చేసుకున్నారని, పన్ను వసూళ్ళలో రాష్ట్ర స్థాయిలో విశాఖపట్నం, విజయవాడ తర్వాత 3వ స్థానంలో గుంటూరు నగరపాలక సంస్థ నిలిచిందని తెలిపారు. షుమారు రూ.20 కోట్ల అన్ కలెక్ట్బుల్ డిమాండ్ తో కలిపి మొత్తంగా ఉన్న రూ.143.46 కోట్ల ప్రైవేట్ డిమాండ్ గాను మార్చి 31 నాటికి రూ.98.25 కోట్లు వసూళ్లు చేయడం జరిగిందని పేర్కొన్నారు. మార్చి 31 (ఆదివారం) ఒక్కరోజు రూ.5.09 కోట్లు వసూళ్లు చేయడం ద్వారా రాష్ట్ర స్థాయిలో ఒక్కరోజులో అధిక కలెక్షన్ చేసి ద్వితీయ స్థానంలో నిలిచిందన్నారు. నగరంలో ప్రభుత్వ, ప్రైవేట్ అసెస్మెంట్ ల నుండి షుమారు రూ.280.86 కోట్లు డిమాండ్ ఉండగా ఏప్రిల్1, 2023 నుండి మార్చి 31, 2024 నాటికి అందులో 114.68 కోట్లు వసూళ్లు జరిగిందని పేర్కొన్నారు. ఏప్రిల్ 1 నుండి 5 వ తేదీ వరకు ఈఆర్పి సర్వర్ ప్రస్తుత ఆర్ధిక సంవత్సర డిమాండ్ అప్ డేట్ చేస్తున్నందున సర్వర్ అందుబాటులో ఉండదని, 6 వ తేదీ నుండి తిరిగి అందుబాటులో ఉంటుందని తెలిపారు.
Tags guntur
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …