విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న ఎన్.టి.ఆర్.జిల్లా 2024సం. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతమైన వాతావరణంలో ఎన్నికల నిర్వహణ కొరకు శాంతి భద్రతలు పరిరక్షణ చర్యలలో భాగంగా నగరంలోని Arms & Ammunition dealers షాప్ లలో తనిఖీ చేసి భద్రతపై నిర్వాహకులకు తగు సూచనలు చేయాలని నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, ఐ.పి.ఎస్.,ఆదేశాల మేరకు సోమవారం డిప్యూటి పోలీస్ కమీషనర్ అధిరాజ్ సింగ్ రాణా ఐ.పి.ఎస్., పోలీస్ అధికారులతో కలిసి నగరంలోని గవర్నర్ పేట మరియు మాచవరం పోలీస్ స్టేషన్ పరిదిలోని Arms & Ammunition dealers షాప్ లను తనిఖీ చేసి నిర్వాహకులకు గన్స్ మరియు ఆమ్యునేషణ్ ల నిర్వహణపై పలు సూచనలు అందిస్తూ ఆదేశాలు జారి చేశారు.
ఈ సందర్భంగా డి.సి.పి.గారు షాప్ లను తనిఖీ చేసి లైసెన్స్ కలిగిన Arms & Ammunition లను మాత్రమే ఉంచాలని, అన్ని వెపన్స్ డిపాజిట్ చేసారా, ఇంకా ఎవరైనా చేయవలసిన వారు ఉన్నారా అనే విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. షాప్ లోని రికార్డులను మరియు డిపాజిట్ చేసిన వెపన్స్ యొక్క వివరాలను క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది.
అదేవిధంగా షాప్ లను నిర్వహించు నిర్వాహకులకు సార్వత్రిక ఎన్నికల నేపధ్యంలో డిపాజిట్ చేసుకున్న వెపన్స్ బయటకు పంపకూడదని, షాప్ చుట్టూ నిరంతరం సి.సి.కెమెరాలను, సెక్యూరిటి గార్డులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసుకోవాలని, షట్టర్లకు డబుల్ లాక్స్ లను ఏర్పాటు చేసుకోవాలని, పర్మిషన్ ఉన్న పర్సనల్ మరియు కమర్షియల్ వెపన్స్ లను మాత్రమె డిపాజిట్ చేసుకోవాలని షాప్ యజమానులకు మొదలగు ఆదేశాలను జారిచేశారు.