విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రస్తుతం జిల్లాలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (ఎంసీసీ) అమల్లో ఉన్న నేపథ్యంలో సోమవారం విజయవాడ ఆర్డీవో, విజయవాడ తూర్పు నియోజకవర్గ ఆర్వో బీహెచ్ భవానీ శంకర్ వివిధ చెక్‌పోస్టులను ఆకస్మికంగా సందర్శించారు. వారధి, ఆటోనగర్, రామవరప్పాడు రింగ్ చెక్‌పోస్టులను పరిశీలించి తనిఖీలు జరుగుతున్న తీరును పరిశీలించారు. అక్రమంగా నగదు, మద్యం, విలువైన లోహాలు వంటి వాటి రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు సిబ్బంది నిరంతర నిఘా, అప్రమత్తతతో వ్యవహరించాలని ఈ సందర్భంగా ఆర్డీవో భవానీ శంకర్ సూచించారు. ప్రతి నియోజకవర్గంలో ఫ్లయింగ్ స్వ్కాడ్లు, ఎంసీసీ బృందాలు పనిచేస్తున్నాయని తెలిపారు. ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ (ఈఎస్ఎంఎస్) పటిష్ట అమలుకు ఎన్పోర్స్మెంట్ ఏజెన్సీల అధికారులు కృషిచేయాలని ఆర్డీవో భవానీ శంకర్ సూచించారు. ఆర్డీవోతో పాటు పోలీస్, మునిసిపల్ తదితర శాఖల అధికారులు ఉన్నారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …