విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళలు, యువతులు ఆర్థికంగా ఎదుగడానికి వాసవ్య మహిళా మండలి వివిధ కార్యక్రమాల ద్వారా శిక్షణను ఇస్తుందని సంస్థ అధ్యక్ష్యులు డాక్టర్ బొల్లినేని కీర్తి తెలిపారు. హెచ్.సి.యల్ సహకారంతో గన్నవరం, విజయవాడలో శిక్షణా కేంద్రాలలో టైలరింగ్, ఫ్యాషన్ డిజైనింగ్, హ్యాండ్ ఎంబ్సైడరి, అత్యాధునిక డిజైనర్ బ్లౌజులు మరియు డ్రెస్ ల తయారి, మగ్గం వర్క్, టాలి, జి.ఎస్.టి, కంప్యూటర్ శిక్షణ రంగాలలో శిక్షణ పొంది ఎందరో యువతులు, మహిళలు ఆర్థికంగా ఎదుగుతూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నారని ఆమె అన్నారు. ఈ అంశాలపై తదుపరి బ్యాచ్ 8న ప్రారంబం అవుతుందని కావున శిక్షణలో చేరాలనుకొనే వారు ఏప్రియల్ 6 లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోర్సు పూర్తి చేసిన అనంతరం సర్టిఫికెట్లను ఇవ్వడం జరుగుతుందని ఆమె అన్నారు. ఇతర వివరములకు 9573404319, 08662470966 నంబర్లను గాని లేదా బెంజ్ సర్కుల్ నందుగల వాసవ్య మహిళా మండలి కార్యాలయంలో సంప్రదించవచ్చని ఆమె తెలిపారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …