-పొట్టిలంక చెక్ పోస్ట్ ను తనిఖీ చేసిన జేసి తేజ్ భరత్
-కలెక్టర్ మాధవీలత
రాజమహేంద్రవరం / కడియం, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికలు ఓటర్లు స్వేచ్ఛగా ఓటు వేసేందుకు, ఓటర్ల ను ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా చూసుకోవడం లో ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాలు, చెక్ పోస్ట్ బృందాలు తనిఖీలు ముమ్మరం చెయ్యాలని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత ఆదేశించారు.
మంగళవారం జాయింట్ కలెక్టర్ తేజ్ భరత్ కడియం మండలం పొట్టిలంక చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించి, కలెక్టర్ కి సంబంధించిన వివరాలను తెలియ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత నియోజక వర్గాల రిటర్నింగ్ అధికారులకు క్షేత్ర స్థాయిలో విధులను నిర్వర్తించే వివిధ నోడల్ అధికారుల పర్యవేక్షణ పై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఓటర్ల ను ప్రలోభాలకు గురి చేసేందుకు వివిధ మార్గాల ద్వారా నగదు , వస్తువులు, మద్యం తదితరాలు తరలించే అవకాశం ఉందని తెలిపారు. చెక్ పోస్ట్ ల వద్ద విధులు నిర్వహించే సిబ్బంది సమయ పాలన ఖచ్చితంగా పాటించాలనీ పేర్కొన్నారు. నిఘా నిర్వహించడం లో నిబద్దత కలిగి ఉండడం, ఎన్నికల కమీషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను ఉల్లంఘన చేసే వారిపై కేసులు నమోదు చేయలని తెలియ చేశారు. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చెక్ పోస్టులు వద్ద మరింత ఎక్కువగా నిఘా నిర్వహించాలనీ పేర్కొనడం జరిగింది.
కోనసీమ జిల్లా నుంచి తూర్పు గోదావరి జిల్లా కి వొచ్చే పొట్టిలంక చెక్ పోస్ట్ వద్ద రికార్డులను పరిశీలించినట్లు జిల్లా జాయింట్ కలెక్టర్, రాజమండ్రి రూరల్ ఆర్వో తేజ్ భరత్ తెలిపారు. చెక్ పోస్ట్ వద్ద షిఫ్ట్ ల వారీగా విధులను నిర్వర్తించే వారు విధిగా హజరు రిజిస్టర్ లో సంతకాలు చెయ్యాలని ఆదేశించారు. ప్రతీ రోజు నిర్దేశించిన లక్ష్యాల మేరకు తనిఖీలు నిర్వహించాలని, అనుమానం కలిగిన వారిపై మరింతగా దృష్టి పెట్టాల్సి ఉందన్నారు. వాటి వివరాలు ఎప్పటి కప్పుడు నమోదు చేయ్యలన్నారు. చెక్ పోస్ట్ ల సి సీ కెమెరాల పనితీరు విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలనీ పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా మీదుగా జాతీయ రహదారులు ప్రధాన మార్గాలు వెళుతూ ఉన్నాయానీ, ఆమేరకు వాహనాలు, రవాణా వ్యవస్థ పై, వ్యక్తుల కదలికల పై నిఘాను మరింత ఎక్కువగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారన్నారు. ఈ సందర్శన సమయంలో ఆర్వో వెంట తహసీల్దార్ బి. రమాదేవి, సి ఐ – బి. తులసీధర్, డి టి సుధీర్, తదితరులు పాల్గొన్నారు.