-2024 సార్వత్రిక ఎన్నికలలో ఓటు కి ఇదే చివరి అవకాశం
-ఓటరుగా నమోదు కు , ఓటర్ చిరునామా మార్పు , బదలీ కి ఏప్రిల్ 14 వరకు అవకాశం
-ఏప్రిల్ 1 వ తేదీకు 18 ఏళ్లు నిండిన వాళ్ళు అర్హులు
-కేవలం ఆన్లైన్ ద్వారా మాత్రమే దరఖాస్తు అవకాశం
-కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో 2024 నాటికి ఏప్రిల్ 1 వ తేదీ నాటికి 18 ఏళ్ళు నిండిన యువ ఓటర్లు ఫారం 6 ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకుని ఓటరుగా నమోదు అవకాశం ఉందని, అదే విధంగా ప్రస్తుతం ఓటరుగా నమోదు అయిన ఓటర్లు చిరునామా మార్పు కోసం ఫారం 8 ద్వారా అవకాశం ఉందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత మంగళవారం ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.
ముఖ్యంగా జిల్లాలో ఏప్రియల్ ఒకటవ తేదీ నాటికి 18 ఏళ్లు దాటిన యువ ఓటర్లు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆన్లైన్ లో ఓటు హక్కు కోసం ఫారం 6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలి అనీ పిలుపు నివ్వడం జరిగింది. అదే విధంగా ఎన్నికల నేపథ్యంలో బదలీపై వచ్చిన అధికారులు ఫారం 8 ద్వారా జిల్లాకి తమ ఓటు హక్కు ను బదలీ చేసుకోవడం లేదా చిరునామా మార్పు కోసం ధరఖాస్తు చేసుకోవలసి ఉంటుందన్నారు. ఏప్రియల్ 14 లోగా ఈ సి ఐ వెబ్సైట్ లేదా ఓటర్ హెల్ప్ లైన్ లో ధరఖాస్తు కు ఇదే చివరి అవకాశం అన్నారు. కొత్తగా నమోదైన ఓటర్లకు, చిరునామా మార్పు, లేదా బదలీ కాబడిన వారికీ పోలింగ్ రోజున ఓటు హక్కును వినియోగించుకునేందుకు వారీ పేర్లు వివరాలను అనుబంధ ఓటరు జాబితా లో పొందుపరచడం జరుగుతుందనీ మాధవీలత తెలియ చేశారు.