రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జాతీయ న్యాయసేవాధికార సంస్థ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం తూర్పు గోదావరి జిల్లాలో ఈ దిగువ తెలుపబడిన అన్ని కోర్టుల యందు ది. 11.05.2024 న (శనివారం) జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తూర్పు గోదావరి జిల్లా – జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు చైర్మన్ గంధం సునీత మంగళ వారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
1. రాజమహేంద్రవరం, 2. అమలాపురం, 3. కాకినాడ, 4. పెద్దాపురం, 5. పిఠాపురం, 6. రామచంద్రపురం, 7. రాజోలు, 8. ఆలమూరు, 9. తుని, 10. ముమ్మిడివరం, 11. కొత్తపేట, 12. ప్రత్తిపాడు, 13. అనపర్తి, 14. రంపచోడవరం, 15. అడ్డతీగల.
ఈ జాతీయ లోక్ అదాలత్ నందు, కోర్టులలో పెండింగ్ లో ఉన్న సివిల్ తగాదాలు, యాక్సిడెంట్ కేసులు, బ్యాంకు కేసులు రాజీపడ్డదగ్గ క్రిమినల్ కేసులు మరియు ప్రీ-లిటిగేషన్ కేసులు రాజీమార్గం ద్వారా పరిష్కరింపబడునని తెలిపారు.
కావున కక్షిదారులందరు ఈ సదావకాశాన్ని ఉపయోగించుకుని జిల్లా వ్యాప్తంగా జరుగు జాతీయ లోక్ అదాలత్ నకు ది. 11.05.2024 న (శనివారం) ఉదయం 10 గంటల నుండి తమ యొక్క కేసులను ఆయా కోర్టుల నందు పరిష్కరించు కొనవలసినదిగా తెలియజేయడమైనది.