Breaking News

రాష్ట్ర ప్రజలకు బాబు వాయిస్ మెసేజ్ లపై సీఈఓకు ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు

-మూడు అంశాలను లేఖలో ప్రస్తావించిన వైసీపీ

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీని భగ్నం చేయడమే కాకుండా వాయిస్ మెసేజ్ ల ద్వారా రాష్ట్ర ప్రజలకు అవాస్తవాలు ప్రచారం చేస్తున్న చంద్రబాబు, తెలుగుదేశం పార్టీపై రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనాకు సచివాలయంలోని ఆయన కార్యాలయం నందు ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఎన్నికల నేపథ్యంలో ఎటువంటి అనుమతులు లేకుండా లక్షలాది మంది ప్రజలకు వాయిస్ మెసేజ్ లు పంపడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. తక్షణమే టీడీపీ చేస్తున్న తప్పుడు ప్రచారంపై చర్యలు తీసుకోవాలని సీఈవోను కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు చేసిన కుట్రల వల్ల రాష్ట్రంలో 66 లక్షల మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, వితంతువులు ఇబ్బందులు పడుతున్నారని మల్లాది విష్ణు ఆరోపించారు. పైగా ఏ ముఖం పెట్టుకుని బల్క్ మెసేజ్ లు పంపుతున్నారని మండిపడ్డారు. మార్చి 31వ తేదీతో ఆర్ధిక సంవత్సరం ముగుస్తుందని.. ఏప్రిల్ ఒకటో తేదీన ఎటువంటి ఆర్థిక లావాదేవీలు జరగవని గుర్తుచేశారు. రెండో తేదీన నగదును డ్రా చేసి.. మూడో తేదీన అవ్వాతాతలకు బట్వాడా చేయడం జరుగుతుందని చెప్పారు. గతేడాది కూడా ఏప్రిల్ 3 న పింఛన్లు అందించామని.. సంబంధిత మంత్రి బూడి ముత్యాలనాయుడు కూడా ఏప్రిల్ 3న పింఛన్లు పంపిణీ చేస్తామని గతేడాది ప్రకటించినట్లు తెలిపారు. కానీ తెలుగుదేశం మాత్రం కేవలం గోబెల్స్ ప్రచారానికే పరిమితమైందని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి బస్సు యాత్రకు వస్తున్న జనాదరణను చూసి చంద్రబాబు ఓర్వలేకపోతున్నారని మల్లాది విష్ణు అన్నారు. కనుకనే ‘ఐ టీడీపీ’ వెబ్ సైట్ ద్వారా ముఖ్యమంత్రిపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. సీఎం జగన్ ను కించపరుస్తూ చేస్తున్న తప్పుడు పోస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్ ను కోరినట్లు మల్లాది విష్ణు తెలిపారు. అధికారంలో ఉండగా ప్రజలకు ఏం చేశారో చెప్పే ధైర్యం బాబుకు లేదని.. కనుకనే ముఖ్యమంత్రిపై బురద చల్లుతున్నారని నిప్పులు చెరిగారు. 2018 డిసెంబర్ వరకు కూడా కేవలం వెయ్యి రూపాయలు పింఛన్ మాత్రమే ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వస్తే రూ. 4 వేలు ఇస్తాననడం హాస్యాస్పదమని మల్లాది విష్ణు అన్నారు. పైగా ఈ మూడు నెలలు కూడా పెంచిన పింఛన్ ను పంపిణీ చేస్తామంటూ ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారని ఆరోపించారు. సంక్షేమ కార్యక్రమాలపై గంటకో మాట మాట్లాడటం తెలుగుదేశం నేతలకు షరామామూలేనని మల్లాది విష్ణు అన్నారు. నిన్నమొన్నటి వరకు ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక అయిపోతోందని విమర్శలు చేసిన వారంతా.. సంక్షేమ పథకాలు కొనసాగిస్తామంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మరోవైపు ఎన్నికలలో కులాలు, మతాల ప్రస్తావన ఉండకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ.. సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెలంపల్లి శ్రీనివాస్ పై పనిగట్టుకుని కులాల పేరుతో కరపత్రాల రూపంలో చేస్తున్న దుష్ప్రచారంపై కూడా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేసినట్లు మల్లాది విష్ణు తెలిపారు. కనుక రాష్ట్ర ప్రజలందరూ చంద్రబాబు చేస్తున్న కుట్రలను అర్థం చేసుకుని.. తెలుగుదేశం పార్టీకి మరోసారి గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు. ఎమ్మెల్యే వెంట నవరత్నాలు కార్యక్రమం ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్‌ అంకంరెడ్డి నాగ నారాయణమూర్తి, వైసీపీ లీగల్ సెల్ ప్రెసిడెంట్ మనోహర్ రెడ్డి, లీగల్ సెల్ సభ్యులు శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *