Breaking News

పిఠాపురం నియోజక వర్గంలో ఇంటింట ప్రచారానికి సన్నద్ధం

పిఠాపురం, నేటి పత్రిక ప్రజావార్త :
పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం నిమిత్తం టిడిపి ఇంఛార్జి ఎస్.వి.ఎస్.ఎన్.వర్మ ఆధ్వర్యంలో టిడిపి రూపొందించిన కరపత్రాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. కూటమి అధికారంలోకి వచ్చాక పిఠాపురం నియోజక వర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తాం అనే అంశంపై పవన్ కళ్యాణ్ నిబద్ధతతో చెప్పిన హామీలను ఇందులో పొందుపరిచారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “పిఠాపురం నియోజకవర్గానికి ఎన్నో వందల శతాబ్దాల చరిత్ర కలిగి ప్రాంతం. జైన, బౌద్ధ, శైవ, వైష్ణవ దివ్య క్షేత్రాల కూడలిగా ఈ ప్రాంతం ప్రసిద్ధి పొందింది. ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక నగరంగా అభివృద్ధి చేస్తాం. దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాం. ఇరిగేషన్ సంబంధిత అంశాలపై ప్రత్యేక దృష్టి పెడతాం. పిఠాపురాన్ని నా స్వస్థలం చేసుకొని, ప్రతి సమస్యను నా సమస్యగా భావించి పరిష్కరించే బాధ్యత తీసుకుంటాను. టిడిపి ఇంఛార్జి వర్మ  అనుభవం ఈ ఎన్నికలకి ఎంతో దోహదం చేస్తుంది. ఇంటింటి ప్రచారం కోసం ఆయన ప్లాన్ చేశారు. సమన్వయంతో ముందుకు వెళ్తాం” అన్నారు.
వర్మ మాట్లాడుతూ… “పిఠాపురం నియోజకవర్గం కోసం పవన్ కళ్యాణ్ చెప్పిన హామీలు, మా కూటమి చేసే అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకి చెబుతాం. రేపటి నుంచే ఇంటింట ప్రచారం మొదలుపెడతాం. అన్ని మండలాల్లో తిరిగేందుకు ప్లాన్ చేశాము” అన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *