Breaking News

ఏలూరు లో ఎన్నికల ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ను పరిశీలించిన స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా…

ఏలూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లాలో ఎన్నికల నిర్వహణ సన్నద్ధత ను పరిశీలించేందుకు మంగళవారం స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా ఏలూరు విచ్చేసారు. తొలుత కలెక్టరేట్ లో ఏర్పాటుచేసిన ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ మీడియా కంట్రోల్ రూమ్ ను సందర్శించారు. తొలుత మీడియా కంట్రోల్ రూమ్ నిర్వహణ తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియా లో ఎన్నికల ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై వచ్చే ప్రతికూల వార్తలను నమోదు చేసే విధానం, వాటి పరిష్కార తీరును ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అందుకు సంబందించిన వివరాలను తెలియజేస్తూ మీడియా లో వచ్చే ప్రతికూల వార్తలు,పిర్యాదులకు సంబందించి వివరాలు కంట్రోల్ రూం నుంచి జిల్లా ఎన్నికల అధికారి, సంబంధిత రిటర్నింగ్ అధికారులకు చేరవేయబడుతుందని పిమ్మట అందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని వివరించారు. అనంతరం సోషల్ మీడియా లో వచ్చే అంశాలపై స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా ఏ విధంగా వాటిని పరిష్కరిస్తున్నదీ సంబంధిత అధికారులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సోషల్ మీడియాకు సంబంధించి పేస్ బుక్, వాట్సాప్, ట్విట్టర్, మాధ్యమాలలో వచ్చే రాజకీయపరమైన ప్రకటనలు, సంబంధిత అంశాలను పరిశీలించి వాటిని సంబంధిత రిటర్నింగ్ అధికారులకు పంపడం ద్వారా అవసరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ వివరించారు. అనంతరం సి విజిల్ పర్యవేక్షక విభాగాన్ని స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా పరిశీలించారు. స్టాటిక్ సర్వేలెన్స్ టీం లు, ఫ్లైయింగ్ సర్వేలెన్స్ టీం లు క్షేత్రస్థాయిలో పరిశీలనకు సంబంధించి ఆయా వాహనాలకు అమర్చిన జి. పి ఎస్. విధానం ద్వారా ఆయా వాహనాలు ఎక్కడ ఉన్నది,ఆయా నిఘా బృందాల కదలికలను పరిశీలించే కంట్రోల్ రూమ్ నిర్వహణా తీరును ఆయన పరిశీలించారు. అనంతరం ఎన్నికల కమిషన్ కు రోజూవారీ నివేదికలు పంపే విభాగాన్ని ఆయన సందర్శించారు. అనంతరం జిల్లాలో ఎన్నికల సన్నద్ధత ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్,జిల్లా ఎస్పీ డి.మేరీ ప్రశాంతి స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా కు వివరించారు. తొలుత జిల్లాలో జరుగుతున్న స్వీప్ కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా తిలకించారు.

తొలుత స్పెషల్ జనరల్ అబ్జర్వర్ రామ్ మోహన్ మిశ్రా కు జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, జిల్లా ఎస్పీ డి. మేరీ ప్రశాంతి,జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్య వేణి స్వాగతం పలికారు.

జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్య వేణి, ఐ టి డి ఏ ప్రాజెక్ట్ అధికారి ఎం. సూర్యతేజ, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీపూజ, డి అర్ వో డి.పుష్పమణి, ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులు ఎన్ఎస్ కె. ఖాజావలి, ఎం. సూర్యతేజ, వై. భవాని శంకరి, కె. అద్దయ్య,ఎం. ముక్కంటి పలువురు నోడల్ అధికారులు పాల్గొన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *