పిఠాపురం, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని పిఠాపురంలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే టీడీపీ-జనసేన-బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి మర్యాదపూర్వకంగా కలిసారు. ఏపిలో మూడు పార్టీల పొత్తు కోసం పవన్ కళ్యాణ్ చేసిన కృషికి సుజనా చౌదరి అభినందనలు తెలిపారు. రాష్ట్రంలో దుష్టపాలనని అంతమొందించి, ప్రజాప్రభుత్వం ఏర్పడటం కోసం జనసేన త్యాగాలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. పొత్తు కోసం తన సొదరుడు పోటీలో నుంచి వైదొలగాల్సి వచ్చినా సిద్ధపడిన పవన్ కళ్యాన్ వ్యక్తిత్వాన్ని మెచ్చుకున్నారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో నా గెలుపు సునాయాసం అని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అన్న మాటలకి కృతజ్ఞతలు చెప్పారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో ప్రచారానికి తాను కూడా వస్తానని పవన్ కళ్యాణ్ మాట ఇచ్చారు. వారికి మరోసారి ధన్యవాదాలు తెలిపారు సుజనా చౌదరి.
Tags AMARAVARTHI
Check Also
విద్యుత్ ఛార్జీల బాదుడుపై నిరంతర పోరాటం
– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలపై కూటమి …