రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
పెన్షన్ పంపిణీ లో భాగంగా తొలి రోజు సుమారు 40 శాతం మంది సామాజిక భద్రత పింఛను దారులకు రూ.29 కోట్ల 26 లక్షల మేర పెన్షన్ సొమ్ము పంపిణీ చేయటం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉన్న 2,43,831 మందికి పెన్షన్ లబ్దిదారులకు రూ.72,39,79,500 లు అంద చేయ్యాల్సి ఉండగా బుధవారం రాత్రి 8 గంటల వరకు 95,819 మందికి రూ.29,26,24,000 పంపిణీ చేసినట్లు తెలిపారు.
ఏప్రియల్ 4,5, 6తేదీ వరకు ఈ పెన్షన్ లని సచివాలయాలు ద్వారా పంపిణీ చేయటం జరుగుతుంది అని తెలిపారు. లేవలేని స్థితిలో వున్న, 40శాతం పైబడి ఉన్న పి డబ్ల్యు డి పెన్షన్ దారులకు వారీ ఇంటి వద్దనే పెన్షన్ నగదు మొత్తాన్ని క్షేత్ర స్థాయిలోనీ సిబ్బంది ద్వారా పంపిణీ చేయటం జరుగుతుంది అని తెలిపారు. రానున్న రెండూ రోజుల్లో అందుబాటులొ వున్న పెన్షన్ దారులకు పెన్షన్ అందజేసేందుకు అన్ని పకడ్బందీ ఏర్పాట్లు చేశామన్నారు. తోలి రోజూ బ్యాంకుల నుంచి డబ్బు ఉపసంహరణ ప్రక్రియ వలన మధ్యహ్నం నుంచి ప్రారంభించారని, రేపటి నుంచి ఉదయం 7 గంటలకి ఇళ్ళకి వెళ్ళి లేవలేని స్థితిలో వున్న, 40 శాతం పైబడి ఉన్న పి డబ్ల్యు డి పెన్షన్ దారులకు పెన్షన్ సొమ్ము అందచెయ్యనున్నట్లు కలెక్టర్ మాధవీలత తెలియ చేశారు. తొలి రోజున పెన్షన్ పంపిణీ లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా పంపిణీ చేయటం జరిగిందన్నారు.