Breaking News

ఎన్నికల నిర్వహణకు పక్కా ప్రణాళిక

– నిష్పక్షపాతంగా, పారదర్శకంగా ఎన్నికలు జరిపేందుకు ఈసిఐ మార్గదర్శకాలకు అనుగుణంగా ఏర్పాట్లు
– జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నిష్పక్షపాత, పారదర్శక ఎన్నికల నిర్వహణకు పక్కా ప్రణాళికతో సిద్ధంగా ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్.డిల్లీరావు అన్నారు. స్థానిక ప్రభుత్వ అతిధి గృహంలోని సమాచార పౌర సంబంధాల శాఖ మీడియా సెంటర్లో శుక్రవారం జిల్లాలో ఎన్నికల నిర్వహణ సన్నద్ధత, ఎన్నికల ప్రణాళిక తదితర అంశాలపై జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డిల్లీరావు మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 18వ తేదీన ప్రకటించే ఎన్నికల నోటిఫికేషన్ జారీ నుండి నామినేషన్ స్వీకరణ, పరిశీలన, ఉపసంహరణ మే 13న నిర్వహించే పోలింగ్, జూన్ 4న నిర్వహించే కౌంటింగ్ ప్రక్రియలకు నిర్దిష్ట ప్రణాళికతో ఏర్పాటు చేసుకొని సిద్ధంగా ఉన్నామన్నారు. జిల్లాలో ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని… నియమావళిని ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేస్తున్నామన్నారు. ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా పర్యవేక్షిస్తూ జిల్లాలో మార్చి 16వ తేదీ నుండి నేటి వరకు 6 కోట్ల 25 లక్షల విలువైన క్యాష్ ,లిక్కర్,డ్రగ్స్, గోల్డ్ , ఇతర విలువైన వస్తువులను సీజ్ చేయటం జరిగింది అన్నారు. 4,300 లీటర్ల లిక్కర్ సీజ్ చేశామన్నారు. ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ద్వారా ఎన్నికల ప్రవర్తన నియమావళి ఉల్లంఘనలపై 867 ఫిర్యాదులను స్వీకరించి 837 కు పైగా ఫిర్యాదులను పరిష్కరించామన్నారు. సి విజిల్ ద్వారా నమోదైన 346 ఫిర్యాదులు వంద నిమిషాలలో పరిష్కరించవలసి ఉండగా వాటిని సగటున 52 నిమిషాల లోపే పరిష్కరించామన్నారు. రాజకీయ పార్టీలు డోర్ టు డోర్, ర్యాలీ ప్రచారానికి సకాలంలోనే అనుమతులు మంజూరు చేస్తున్నామన్నారు. అనుమతులు మేరకే ప్రచారం నిర్వహించుకోవాలని ఎక్కడా కూడా ప్రవర్తన నియమాలను ఉల్లంఘించకుండా ప్రచారం నిర్వహించుకునేలా అవగాహన కల్పించామన్నారు. ఈనెల 17వ తేదీ వరకు ప్రచారానికి అయ్యే ఖర్చును పార్టీలకు, 18వ తేదీ నుండి జూన్ 4 వరకు పోటీలోని అభ్యర్థులకు వ్యయ నమోదు చేయడం జరుగుతుందన్నారు. ఈనెల 14వ తేదీ వరకు ఫారం 6 కు సంబంధించిన చేర్పులకు అనుమతి ఉందన్నారు. జిల్లాలో ఎలక్ట్రోరల్ పాపులేషన్ రేషియో 1000 కి 694 గా, స్త్రీ,పురుష నిష్పత్తి రేషియో 1050 గా వుందన్నారు. ఓటర్లకు ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అందించడం జరుగుతుందన్నారు. జిల్లాలో సుమారు 840 క్రిటికల్ పోలింగ్ స్టేషన్లను గుర్తించడం జరిగిందని ఆయా పోలింగ్ స్టేషన్ లొకేషన్లలో వెబ్ కాస్టింగ్, వీడియోగ్రఫీ, మైక్రో అబ్జర్వర్ల పరిశీలన ద్వారా పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. ట్రాన్స్ పోర్టేషన్ ప్లాన్ లో భాగంగా పోలింగ్ అధికారులు సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు రవాణాపై ప్రత్యేక దృష్టి పెట్టామని దీనిలో భాగంగా ప్రతి ఐదు పోలింగ్ స్టేషన్లకు 50 సీట్ల సామర్థ్యం గల బస్సును ఏర్పాటు చేస్తున్నామన్నారు. నామినేషన్ ప్రక్రియలో రిటర్నింగ్ అధికారులు తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించామన్నారు. పిఓలు, ఏపీవోలకు పోలింగ్ నిర్వహణపై ఈ నెల 13, 14 తేదీలలో మొదటి దశ , 29వ తేదీన రెండవ దశ శిక్షణ ఇవ్వనున్నామని అన్నారు. పోలింగ్ నిర్వహణకు బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వివి పాట్లు అవసరానికి మించి అదనంగా 120 శాతానికి పైగా సిద్ధం చేసుకున్నామన్నారు. ఈనెల 12వ తేదీన ఈవీఎం ర్యాండ్ మైజేషన్ నిర్వహిస్తామన్నారు. 85 సంవత్సరాల పైబడిన వయస్సు, అర్హులైన పిడబ్ల్యుడి ఓటర్లు హోం ఓటింగ్ కై ఫార్మ్ 12 డి ఈనెల 29వ తేదీ లోగా సమర్పించవలసి ఉంటుందని అన్నారు. జిల్లాలో ఫ్లయింగ్ స్కాడ్లు, స్టాటిటికల్ సర్వేలన్స్ టీములు పూర్తి పర్యవేక్షణ చేస్తున్నారని, ఇంటర్ స్టేట్ ,ఇంటర్ డిస్ట్రిక్ట్ బోర్డర్ చెక్ పోస్టులవద్ద సిఆర్పిఎఫ్, స్టేట్ పోలీస్ , సివిల్ ఆఫీసర్లతో గట్టి నిఘా ఉంచామన్నారు. నిర్దిష్ట ప్రణాళికతో నిష్పక్షపాత పారదర్శక ఎన్నికల నిర్వహణకు పూర్తి సన్నద్ధత తో ఉన్నామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డిల్లీరావు అన్నారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *