– ఎన్ కోర్ ద్వారా 381 దరఖాస్తులు , 298 కి ఆమోదం, 48 తిరస్కరణ , పరిశీలన, పెండింగు దశలో 35
– జిల్లా ఎన్నికల అధికారి మాధవీలత
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల కోసం జిల్లాలో ప్రచారం కోసం వొచ్చే అభ్యర్థనలను 48 గంటల్లో సింగిల్ విండో విధానం ద్వారా మార్గదర్శకాల మేరకు 298 దరఖాస్తులకు అనుమతులను జారీ చెయ్యడం, అసంపూర్తి గా ఉన్నా 48 తిరస్కరించడం జరిగిందని కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డా కె. మాధవీలత శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఎన్ కోర్ : సెల్ అధ్వర్యంలో సింగిల్ విండో విధానం లో సువిధా లో వస్తున్న దరఖాస్తులను పరిశీలించి ఎన్నికల కమీషన్ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అనుమతులను జారీ చేస్తున్నామని పేర్కొన్నారు. సక్రమంగా లేని వాటి విషయంలో తగిన సూచనలు చెయ్యడం జరుగుతోందని అన్నారు. సంబంధిత అధికారులు వాటినీ పరిశీలించి నిర్దారణ చెయ్యడం, అవసరమైన ధ్రువపత్రాలు పరిశీలించి ఆమేరకు అనుమతులను జారీ చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీలు తప్పని సరిగా అనుమతుల కోసం సూచనల మేరకు అవసరమైన పత్రాలు అందజేయాల్సి ఉంటుందన్నారు. వాటినీ ఎన్ కోర్ యాప్ ద్వారా అప్లోడ్ చెయ్యాల్సి ఉంటుంది. జిల్లాలో ఈరోజు వరకు 7 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో ఎన్ కోర్ ద్వారా 381 అభ్యర్ధనలు రాగా వాటిలో 298 కి అనుమతులు జారీ చేశామని, 48 తిరస్కరించగా , 26 పరిశీలనలో, 9 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నట్లు తెలిపారు. నియోజక వర్గాల వారీగా అనపర్తి 21 దరఖాస్తులలో 15 ఆమోదం, ఒకటి తిరస్కృతి, 5 పరిశీలన లో, రాజానగరం 58 దరఖాస్తులు, 42 ఆమోదం, 15 తిరస్కృతి, ఒకటి పెండింగ్ ; రాజమండ్రి సిటీ 66 దరఖాస్తులు, 43 ఆమోదం, 14 తిరస్కృతి, 2 పరిశీలనలో, 7 పెండింగ్ ; రాజమండ్రీ రూరల్ 31 దరఖాస్తులు, 24 ఆమోదం, 1 తిరస్కృతి ; 6 పరిశీలనలో, కొవ్వూరు 38 దరఖాస్తులు, 33 ఆమోదం, 3 తిరస్కృతి ,
1 పరిశీలనలో, 1 పెండింగ్ లో , నిడదవోలు 101 దరఖాస్తులు, 94 ఆమోదం, 7 పరిశీలనలో ; గోపాలపురం 66 దరఖాస్తులు, 47 ఆమోదం, 7 తిరస్కృతి, 12 పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు.
ప్రింటింగ్ ప్రెస్ వారికీ:
వివిధ ప్రచారాలు నిమిత్తం ప్రింటింగ్ చేసే కరపత్రాలు, ఇతర ప్రచురణల సమాచారం ప్రజా ప్రాతినిధ్యం చట్టం 1951 లోని ఆర్టికల్ 127 ఏ మార్గదర్శకాలు ఖచ్చితంగా పాటించాలని స్పష్టం చేశారు. ప్రచురించిన కరపత్రాలు సంఖ్య, ప్రింటర్ పేరు, చిరునామా లో తదితర సమగ్ర సమాచారం ముద్రించడం, మూడు రోజులలో ఆర్వో లకి నివేదికలు పంపించాలన్నారు. శాటిలైట్ ఛానళ్ళు, స్ధానిక కేబుల్ నెట్ వర్క్ లు, సినిమా ధియేటర్ లు, సోషల్ మీడియాలో ప్రదర్శించే వీడియో ల ప్రసారాలకు సంబందించిన ముందస్తు అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు.