Breaking News

మూడోవ రోజూ కొనసాగిన పెన్షన్ పంపిణీ

-రాత్రి 8 గంటల వరకు పూర్తి చేసిన లబ్ధిదారులు 94.25 శాతం పంపిణీ
– కలెక్టర్ మాధవీలత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా పరిధిలోనీ 19 మండలాలు, 3 మునిసిపాలిటి లకి చెందిన 2,43,831 మంది సామాజిక భద్రత పింఛను దారుల్లో 2,29,813 మందికీ (94.25 శాతం) పెన్షన్ పంపిణీ చేయటం జరిగిందనీ జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత శుక్రవారం రాత్రి ఒక ప్రకటనలో తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా పరిధిలో ఉన్న మొత్తం 2,43,831 మంది పెన్షన్ లబ్దిదారులకు రూ.72,39,79,500 లు అందచేయ్యాల్సి ఉండగా గురువారం రాత్రి 8గంటల వరకు 2,29,813 మందికి రూ.69,08,58,000 (95.44 %) పంపిణీ చేసినట్లు తెలిపారు. లేవలేని స్థితిలో వున్న, 40 శాతం పైబడి ఉన్న పి డబ్ల్యు డి పెన్షన్ దారులకు వారీ ఇంటి వద్దనే పెన్షన్ నగదు మొత్తాన్ని పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో నల్లజర్ల లో అత్యధికంగా 96.41% , గోకవరంలో 96.39 %, రాజమండ్రీ అర్బన్ 95.76 పంపిణీలో మొదటి మూడు స్థానాల్లో ఉండగా , దిగువన బిక్కవోలు 91.57 %, కొవ్వూరు లో 92.15 % మందికీ పంపిణీ చేయటం జరిగిందన్నారు. అందు బాటులో ఉన్న పెన్షన్ స్కీమ్ లబ్దిదారులకు పెన్షన్లు పంపిణీ చేయటం జరగాలని కలెక్టర్ ఆదేశించారు.

Check Also

జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *