విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
హిమాచల్ ప్రదేశ్‌లోని చంబాలో బలమైన భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంపం తీవ్రత 5.3గా నమోదైంది. ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం లేదు. నగరంలోని అనేక ప్రాంతాలతో పాటు మనాలిలో కూడా బలమైన ప్రకంపనలు సంభవించాయి. హిమాచల్‌లో భూకంపం సంభవించడానికి కొన్ని నిమిషాల ముందు, కశ్మీర్ లోయలో కూడా ప్రకంపనలు వచ్చాయి. భూకంప కేంద్రం భూ ఉపరితలం నుంచి దాదాపు 10 కిలోమీటర్ల లోతున ఉంది. పలు ప్రాంతాల్లో బలమైన భూ ప్రకంపనలు సంభవించాయి. రాత్రి 9:34 గంటలకు భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. కొన్ని సెకన్లపాటు ప్రకంపనలు వచ్చాయి.
కొన్ని సెకన్లపాటు భూ ప్రకంపనలు
మనాలిలో నివసిస్తున్న ప్రజలు చాలా బలమైన ప్రకంపనలు అనుభవించినట్లు చెప్పారు. ప్రకంపనలు కొన్ని సెకన్ల పాటు మాత్రమే వచ్చాయి. అయితే ఈ ప్రకంపనలు చాలా బలంగా ఉన్నాయి. దీంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు.