విజయవాడ , నేటి పత్రిక ప్రజావార్త :
శారద విద్యాసంస్థల విద్యార్థులు శుక్రవారం విడుదలైన ఇంటర్ పరీక్షా ఫలితాలలో ఘన విజయం సాధించారు. జూనియర్ యమ్.పి.సి విద్యార్థులు యస్.యామిని-466/470, కె.జాన్ మార్లిటో 465/470, డి.మాధురి-465/470, జి.రసగ్న-465/470, ఏ.నాగబాబు-464/470, జి.తేజశ్వని-464/470, పి.సాయి వర్ష-464/470, వై.హర్ష నందన వెంకట సంతోష్-463/470, కె.రోహిత్-463/470 మరియు రైనాజైన్-463/470 జూనియర్ బై.పి.సి విద్యార్థులు యస్ జాహ్నవి-435/440, బి.సింధు 433/440, సిహెచ్.శ్రీరామ్-430/440, కె.యషిత-430/440, బి.అనన్య-429/440 మరియు సిహెచ్.బ్రాహ్మణి-428/440 మార్కుల ఉత్తీర్ణతో జూనియర్ ఇంటర్లో మంచి మార్కులతో విజయం సాధించారు. సీనియర్ యమ్.పి.సి విద్యార్థులు సిహెచ్ శ్రీరామ్ సంజీవ్ 987/1000 టి.నాగభారతి-987/1000, కె.నవ్య చంద్రిక-987/1000, సిహెచ్.శ్రావణి-987/1000, మనస్వి దుర్గా-986/1000, టి.లక్ష్మీ తేజస్విని-984/1000 సీనియర్ బైపిసి ఎ.మధుమేఘన-989/1000, ఎం.లావణ్య-987/1000, ఆర్.సింధుశ్రీ-982/1000, బి.తేజస్వి మోహన-980/1000 మరియు యమ్.చిన్మయి-980/1000 మార్కుల ఉత్తీర్ణతతో సీనియర్ ఇంటర్లో మంచి మార్కులతో విజయం సాధించారు. ఇప్పటి పోటీ ప్రపంచంలో మంచి మార్కులు సాధించాలంటే విద్యార్థులు, అధ్యాపకులు మరియు తల్లితండ్రుల పాత్ర ఎంతో ఉండాలని, పరిమిత విద్యార్థులతో ఇంటర్ ఫలితాలలో కళాశాల విద్యార్థులు ఇంత మంచి ప్రతిభ చూపడంలో విద్యార్థులు చాలా గర్వకారణంగా ఉందని శారద విద్యాసంస్థల చైర్మన్ డా. వై.రమేష్‌బాబు ఆన్నారు. విద్యార్థిని విద్యార్థులను అభినందించారు. మేనేజింగ్ డైరెక్టర్ వై.శారదాదేవి మాట్లాడుతూ ముందుగా ఎప్పుడైనా విద్యార్థులను తమ సొంత పిల్లలుగా భావించాలని వారి అభివృద్ధికి దోహదపడాలన్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకులతో స్టడీ అవర్స్ పర్సనల్ కౌన్సిలింగ్ ద్వారా విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్నామన్నారు. విద్యార్థులు మంచి మార్కులు సాధించే ఉన్నతమైన విలువలతో కూడిన విద్యను అందించడంలో మా శారద విద్యాసంస్థలు ఎప్పటికి ముందు ఉంటుందని తెలిపారు. అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు.
Tags vijayawada
Check Also
జిల్లాలోని రిజర్వాయర్ పనులను వేగవంతం చేయండి: జిల్లా కలెక్టర్ డా .ఎస్ వెంకటేశ్వర్
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లాలోని దీర్ఘకాలంగా పూర్తికాని రిజర్వాయర్ పనులను వేగవంతం చేసేలా ప్రత్యేక దృష్టి చేపట్టాలని …